కాపులని తాకట్టు పెట్టడానికి మాకేం హక్కుంది?

Nagababu_Konidelaఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీ- టిడిపి, జనసేనల మద్య జరిగిన రాజకీయాలు యుద్ధాలు ఓ ఎత్తు, ఇక నుంచి జరుగబోయే యుద్ధాలు మరో ఎత్తు అన్నట్లు సాగుతున్నాయి. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కాపులు జనసేనవైపు ఎక్కడ మొగ్గుచూపుతారో అని తీవ్ర ఆందోళన చెందుతున్న వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లపై చేస్తున్న తీవ్ర విమర్శలు, ఆరోపణలని అందరూ వినే ఉంటారు.

ఇప్పుడు వారు వివాదాల రాంగోపాల్ వర్మని కూడా రంగంలో దించడంతో అతను ఎక్కడో కూర్చొని సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతూ ఏపీలో కులచిచ్చు రగిలిస్తున్నారు.

ADVERTISEMENT

వాటిపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రంగా స్పందిస్తూ, “రాంగోపాల్ వర్మ అనేవాడు ఓ సన్నాసి. వాడు ఇండస్ట్రీలో లేడు. వాడొక నీచ్ కమీనే కుత్తా! వాడు ఎంత నీచానికైనా దిగజారుతాడు. వాడి నోరొక మురికి కాలువ. దానిలో నుంచి ఏదైనా పారుతుంది. కనుక వాడి గురించి నేను మాట్లాడను. కానీ మేము కాపులను ఎవరికో తాకట్టు పెట్టేస్తున్నామనే విమర్శ నాకు చాలా బాధ కలిగిస్తోంది. కాపులను తాకట్టు పెట్టేయడానికి వారేమైనా వస్తువులా?వారికి రాజకీయ విచక్షణ, చైతన్యం లేవని అనుకొంటున్నారా?ఎవరు ఏది చెపితే అది నమ్మేయడానికి?

ఒక్క కాపు కులమే కాదు… ఏ కులానికి చెందినవారైనా అంత ఆత్మాభిమానం లేకుండా బ్రతుకుతున్నారా?అంటే కుల అహంకారం పెరిగిపోవడం చేతనే మనుషులను ఇంత చులకనగా చూస్తున్నారు. కాపులు ఎంతో ఆత్మాభిమానం, నిర్ధిష్టమైన ఆలోచనావిదానం కలిగినవారు. గతంలో వారు ఎన్టీఆర్‌ని, చంద్రబాబు నాయుడుని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుని ఇప్పుడు తమని ద్వేషిస్తున్న ఈ వైసీపీని కూడా కాపులే గెలిపించారు. ఈ విషయం మరిచిపోయి కాపుల గురుంచి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు.

అసలు కాపు కులాన్ని తాకట్టు పెట్టే హక్కు మాకేముంది? మేమెందుకు పెడతాం? అయినా ఓ కుల ప్రజలని తాకట్టు పెట్టడం ఏమిటి? అసలు కులాన్ని తాకట్టు పెట్టడం అనేది ఓ దరిద్రపు మాట. నేను కూడా కాపు కులంలోనే పుట్టాను. నాకు మా కులం అంటే అభిమానం, గౌరవం ఉంది. అలాగని కులపిచ్చి లేదు. మేము మా కులాన్ని ఎంత గౌరవిస్తానో అలాగే ఇతర కులాలని కూడా అంతే గౌరవిస్తాము,” అని అన్నారు.

ADVERTISEMENT
Latest Stories