ఈరోజుల్లో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. యుద్ధ విమానాలను కూడా నడుపుతున్నారు. కనుక వారికి సాధ్యంకానిదంటూ ఏమీ లేదని అర్ధం అవుతోంది. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి హెరిటేజ్ డెయిరీ డైరెక్టరుగా విజయవంతమైన బిజినెస్ విమెన్‌గా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆమె బైక్ రైడింగ్ కూడా చేయగలరని, బైక్ రైడింగ్ క్లబ్బులో మెంబర్ అని ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఈ విషయం ఈరోజు ఆమె స్వయంగా చెప్పారు.
తమ బృందం లడ్డాక్‌లోని లేహ్ ప్రాంతంలో ఈరోజు ఉదయం 6.30 గంటలకు తిక్‌సాయ్ మఠానికి చేరుకొన్నామని తెలిపారు. ఆ కొండ చరియాల నడుమ ఘాట్ రోడ్డులో బైక్ రైడింగ్ అద్భుతమైన అనుభూతినిచ్చిందని బ్రాహ్మణి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అక్కడ కాసేపు ధ్యానం చేసి టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ బైక్‌లపై అందరం బయలుదేరామని చెపుతూ ఆ వీడియోని కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె చాలా బరువైన జావా యజ్డీ బైక్‌ని సునాయాసంగా నడపడం చూస్తే బైక్ రైడింగ్‌లో ఆమెకు చాలా అనుభవం ఉందనే విషయం స్పష్టమవుతుంది.



