Thalliki Vandanam

టీడీపీ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ లో తల్లికి వందనం అత్యంత కీలకమైన హామీగా మారిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు “తల్లికి వందనం” కార్యక్రమం అమలుతో మంచి శుభవార్త అందించింది.

ఈ పథకం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు గాను ఒక్కొక్కరికి 15 వేలు చొప్పున ఈ లబ్ది చేకూరనుంది. ఇందుకు గాను రేపు లబ్ధిదారుల ఖాతాలో 8745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా ద్వారా తల్లికి వందనం పథకం కు గాను విద్యార్థులకు శుభాకాంక్షలు, తల్లులకు అభినందనలు తెలియచేసారు.

Also Read – నిర్మాణం ఎలాగూ చాతకాదు కనీసం..

అయితే టీడీపీ ఎన్నికల హామీ కింద ఇంట్లో ఎంతంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15 వేలు చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే ఇచ్చిన హామీ ప్రకారం రేపు ఈ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

దీనితో సూపర్ సిక్స్ లో మరొక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. ఇప్పటికే పింఛన్ పెంపు, అన్న కాంటీన్, మెగా డీఎస్సీ, దీపం -2 వంటి హామీలు పథకాల రూపంలో అమలులోకి రావడంతో ఒక ఇప్పుడు తల్లికి వందనం ద్వారా లబ్దిదారులకు మరొక మేలు కలగనుంది.

Also Read – బనకచర్లపై చర్చ వద్దట.. ఎందుకు?

ఇక మహిళలకు ఉచిత బస్సు హామీ ఒక్కటి కూటమి ప్రభుత్వం అమలు చేయగలిగితే టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు పూర్తిగా అమలు చేసినట్లవుతుంది. అయితే ఈ ఉచిత బస్సు పథకం కూడా ఈ ఆగస్టు నెల నుంచి మహిళలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సర్వ శక్తులు ఒడ్డుతుంది.

అయితే ఈ ఏడాది ఒకటవ తరగతి, ఇంటర్ చేరిన విద్యార్థులకు ఈ పథకం అమలు చేయనుంది. అందుకు సంబంధించిన పూర్తి డేటా అందుబాటులోకి రాగానే తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తామని, అందుకు అవసరమైన విధివిధానాల పై ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.

Also Read – మంగళగిరి మొనగాడెవరు.?


అలాగే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి e-KYC ని పూర్తి చేయడం, NPCI తో ఆధార్ ను లింక్ చేసుకోవడం తప్పనిసరి.