తన మార్క్ చూపిస్తున్న లోకేష్..!

Nara Lokesh’s Apologies For Convoy Vehicle Hit And Run

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ప్రభుత్వంలోను, పాలనలోను తమదైన కచ్చితమైన మార్పు చూపించాలి అనే గట్టి సంకల్పంతో పని చేస్తున్నారు కూటమి నాయకులు. ఇందులో మరి ముఖ్యంగా నారా లోకేష్ తనను తానూ భవిష్యత్ నాయకుడిగా నిరూపించుకోవడానికి నిత్యం శ్రమిస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన అంతరాన్ని తొలగించడానికి ప్రజాదర్బార్ నిర్వహిస్తూ నిత్యం, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద స్పందిస్తూ ఆ సమస్యకు పరిష్కారమార్గాలు చూపిస్తున్నారు.

ADVERTISEMENT

సిఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల సదస్సులో పాల్గొనడానికి విశాఖ వచ్చిన నారా లోకేష్ దృష్టికి కళ్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదిక గా తన సమస్యను పంచుకున్నారు. విశాఖపట్నం సమీపంలో తాటిచెట్లపాలెం సమీపంలో తన కారును మంత్రి లోకేష్ కాన్వాయిలో ఉన్న ఒక కారు ఢీ కొట్టిందని, దానికి గాను తన కారు కు డ్యామేజ్ జరిగిందంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సామజిక మాధ్యమాల ద్వారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు.

దీని పై వెంటనే స్పందించిన నారా లోకేష్ అందుకు గాను కళ్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తికీ క్షమాపణలు తెలియచేసారు. అలాగే ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృత్తం కాకుండా చూసుకోవాలని భద్రతా సిబ్బందికి తగిన సూచనలు ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే తన కాన్వాయి వల్ల డామేజ్ అయిన కారుకు సంబంధించిన రిపేర్ ఖర్చు పూర్తిగా తానే చెల్లిస్తానంటూ సదరు వ్యక్తికీ రిప్లై ఇచ్చారు లోకేష్.

ఒక సమస్య పై లోకేష్ స్పందించిన తీరు, తప్పు తన వైపు ఉండడంతో మంత్రి అయిన సరే సామాన్యుడికి క్షమాణాలు చెప్పిన తీరు, అందుకు పరిహారం చెల్లిస్తాను అంటూ హామీ ఇచ్చిన వైనం తో లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. గత వైసీపీ పాలనలో అక్రమంగా తమ ఆస్తులు లాక్కుంటున్న మౌనంగా ఉన్న సామాన్యుడు ఇప్పుడు మీ కాన్వాయ్ పొరపాటు వల్ల నా కారుకు డామేజ్ అయ్యింది అంటూ సమస్యను దైర్యంగా మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.

దీనితో ప్రజాస్వామ్య పాలనకు, నియంత పాలనకు మధ్య తేడా స్పష్టంగా ప్రజలకు అర్ధమవుతుంది అంటున్నారు కూటమి నేతలు.

ADVERTISEMENT
Latest Stories