పేపర్ చూడకుండానే ఉతికేసిన నారా లోకేష్‌

Nara_Lokesh_Kuppam_Speechఈరోజు కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభసభలోనే నారా లోకేష్‌ సిఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. బహిరంగసభకు హాజరైన వేలాదిమందిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను పాదయాత్ర చేస్తానని చెప్పిన రోజు నుంచే ఓ 10 మంది మంత్రులు మరే పనీలేన్నట్లు ప్రతీరోజు నాపై విరుచుకుపడుతునే ఉన్నారు.

పాదయాత్ర చేయడానికి నా అర్హత ఏమిటని అడుగుతున్నారు. వారికి తెలియదా రెండు శాఖలకి మంత్రిగా నేను పనిచేసి నా సమర్దత నిరూపించుకొన్నానని? కానీ మీరు, మీ మంత్రులు ఏం చేస్తున్నారు జాదూరెడ్డి?లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు ప్రజలని మోసం చేస్తే మీ మంత్రులు రోడ్ల మీద డ్యాన్సులు చేస్తుంటారు. క్యాసినోలు లక్కీ లాటరీలు నిర్వహిస్తుంటారు.

ADVERTISEMENT

ఆనాడు ఎన్టీఆర్‌, తర్వాత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి ఎన్నో పరిశ్రమలని, ఐ‌టి కంపెనీలని తీసుకువచ్చారు. కానీ ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ, ఐ‌టి కంపెనీ అయిన తీసుకురాకపోగా ఉన్నవాటిని పారిపోయేలా చేశారు. పరిశ్రమలు లేవు… రావు. ఉద్యోగాలు ఉండవు. కనుక జాబ్‌ క్యాలండర్ విడుదల చేయాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి ఉండదు. మూడున్నరేళ్ళు గడిచిపోయాయి… మెగా డీఎస్సీ అన్నారు ఏమయింది?ఇంకా ఎప్పుడు?

మూడు రాజధానులన్నారు? కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానన్నారు?కానీ ఏ ఒక్కటీ చేయలేకపోయారు. ఎందుకంటే మీ మీదున్న కేసుల కారణంగా కేంద్రాన్ని గట్టిగా అడగలేరు. అంటే మీ కేసుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజలు, యువత కూడా నష్టపోవలసిందేనా?ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని ఏకంగా 67 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు. మీకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారో?

మేము మా ఎన్నికల మ్యానిఫెస్టోలోనే యువత కోసం ప్రత్యేకంగా పాలసీని ప్రకటిస్తాము. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తాము? ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామనేది మ్యానిఫెస్టోలోనే స్పష్టంగా పేర్కొంటాము. అలాగే ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలండర్ ప్రకటిస్తాము. ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులని భర్తీ చేస్తాము. కౌలు రైతులని ఆదుకోవడం కోసం మ్యానిఫెస్టోలో ప్రత్యేకంగా మా ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం. మీలాగ మాయమాటలతో ప్రజలని మభ్యపెడుతూ, ప్రాంతాల మద్య చిచ్చుపెడుతూ కాలక్షేపం చేయము. రాష్ట్రాన్ని నాశనం కానీయము,” అని నారా లోకేష్‌ అన్నారు.

“మీ ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నిస్తే మీ మహిళా మంత్రి నాకు చీర,గాజులు పంపిస్తానని ఎద్దేవా చేశారు. చీరలు, గాజులు ధరించే మహిళలంటే మీ మహిళా మంత్రులకె ఎంత చులకనో అర్దం అవుతోంది. ముందు మంత్రి పదవులలో ఉన్నవారు హుందాగా మాట్లాడాలని నేర్చుకొంటే బాగుంటుంది. మేము మీలాగ తల్లిని, చెల్లిని బయటకి పంపించేయలేదు,” అని నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలని అడ్డుకొనేందుకు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్:1 పై కూడా ‘ఏ1-జీ1 జారీ చేశారంటూ’ నారా లోకేష్‌ తనదైన శైలిలో విమర్శించారు. వైసీపీ బెదిరింపులకి భయపడేవాడిని కానని, అడ్డం వస్తే తొక్కుకొంటూ పోతామని తీవ్రంగా హెచ్చరించారు. నా యువగళం పాదయాత్ర ఆపలేరు… పవన్‌ కళ్యాణ్‌ వారాహిని కూడా ఆపడం మీ తరంకాదని నారా లోకేష్‌ తేల్చి చెప్పేశారు.

నారా లోకేష్‌ ప్రసంగం సూటిగా, సుత్తిలేకుండా మొదటి నుంచి చివరి వరకు సిఎం జగన్‌, ఆయన ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపుతూ సాగిపోయింది. నారా లోకేష్‌ ప్రసంగిస్తున్నంత సేపు టిడిపి కార్యకర్తలు హర్షధ్వానాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే! ఇంకా 399 రోజులు వీర ఉతుకుడు ఉంది. మరి వైసీపీ భరించగలదో లేదో?

ADVERTISEMENT
Latest Stories