ఐసీయూలో ఏపీ హోం మంత్రికి చికిత్స!

 Nimmakayala Chinarajappa AP Home minister Injuredతూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సంజీవని ఆసుపత్రిని సంద‌ర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య‌మంత్రి, హోం మంత్రి చినరాజప్ప ప్ర‌మాదానికి గుర‌య్యారు. మూడో అంత‌స్తు నుంచి లిఫ్టులో కిందకు వస్తుండగా లిఫ్టు వైరు ఒక్కసారిగా తెగిపడ‌డంతో చినరాజ‌ప్ప అందులోనే ప‌డిపోయారు. దీంతో ఆయన నడుము భాగంలో గాయాలైనట్లుగా సమాచారం.

దీంతో అదే ఆసుపత్రిలోని ఐసీయూలో చినరాజప్పకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మంత్రి గారితో పాటు ఓ కానిస్టేబుల్‌, ఇద్ద‌రు మీడియా ప్ర‌తినిధుల‌కు కూడా గాయాల‌య్యాయి. రొయ్యల శుద్ధి పరిశ్రమలో అస్వస్థతకు గురై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు చిన‌రాజ‌ప్ప ఈ ఆసుపత్రికి విచ్చేయగా, చివరికి అదే హాస్పిటల్ లో చికిత్స చేయించుకోవాల్సి రావడం విశేషం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories