
మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో నిన్న మచిలీపట్నంలో తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యి తమ గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో తాను, తన భార్యకు ముందస్తు బెయిల్ లభించేవరకు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చిందని, అప్పుడే ఈ రాజకీయాలు వదిలేద్దామా.. అని వైరాగ్యం కలిగిందన్నారు.
ఇప్పుడు నకిలీ భూపట్టాల పంపిణీ కేసులో తనని అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. తమపై అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా వేధిస్తున్నారని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read – సైకో రాజకీయాలు చేయవద్దని చెప్పా: పేర్ని నాని
ఆయన స్వయంగా తమ గోదాములలో నిలువ ఉంచిన రేషన్ బియ్యం మాయం అయ్యిందని చెప్పుకున్నారు. విచారణకు హాజరవకుండా తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయామని ఆయనే చెప్పుకుంటున్నారు. కానీ తమపై ఆ కేసు నమోదు చేయడం, ముందస్తు బెయిల్ లభించిన తర్వాత తన భార్యని పోలీసులు ప్రశ్నించడం రాజకీయ వేధింపులేనని పేర్ని నాని వితండావాదం చేస్తున్నారు.
తాము పంచి పెట్టిన ఇళ్ళ పట్టాలు నకిలీవి కావని ఆయన వాదించారు. అంటే చెప్పుకుంటున్నారు. అంటే ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తండ్రీ కొడుకులు ఇద్దరూ అసలువో.. నకిలీవో ఇళ్ళ పట్టాలు పంచిపెట్టారని స్వయంగా ధృవీకరించినట్లే కదా?
Also Read – పేర్ని లీక్స్…చాల వైలెంట్ గురు
కనుక ఒకవేళ నకిలీ పట్టాలు పంచి ఉంటే వైసీపీ నేతలు ఎంతగా దుర్మార్గంగా ఆలోచిస్తారో అర్దం చేసుకోవచ్చు. అందుకు గాను ప్రజలు పేర్ని కిట్టుని ఎన్నికలలో ఓడించి అప్పుడే బుద్ధి చెప్పారు.
ఒకవేళ అవి నకిలీ లేదా అసలైనవే అయినా వాటితో ఓటర్లను ప్రలోభ పెట్టి పేర్ని అండ్ సన్స్ ఎన్నికల నియామావళి ఉల్లంఘించారు. కనుక ఆ నేరానికి వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుంది?
Also Read – కోటా శ్రీనివాసరావు ఇక లేరు
అయినా కేసులకు, జైలుకి వెళ్ళడానికి భయపడవద్దని, కేసులు పెడితే పెట్టించుకోమని, జైలుకి పంపితే వెళ్ళమని వారి అధినేత జగన్ పదేపదే చెపుతున్నప్పుడు, అందుకు సిద్దమని పేర్ని నాని సవాళ్ళు విసిరినప్పుడు ఇన్ని మాటలు ఎందుకు?