ప్రత్యుష – ఆయిషా కేసులు: పోరాటలే కానీ…

Pratyusha and Ayesha Mira cases highlight decades-long struggle for justice

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన నటి ప్రత్యుష కేసు, విద్యార్థి ఆయిషా మీరా కేసు దశాబ్దాలుగా న్యాయస్థానాలలో మగ్గిపోతున్నాయి. అయితే ఎట్టకేలకు దాదాపు రెండు దశాబ్దాల తరువాత నటి ప్రత్యూష కేసులో నేడు సుప్రీం కోర్ట్ తీర్పు వెల్లడించింది.

2002 ఫిబ్రవరి 23 న హైద్రాబాద్ లో ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్దార్ధ్ ఇద్దరు కూడా తమ ప్రేమకు సిద్దార్ధ్ కుటుంబం అంగీకరించేందుకు సిద్ధంగా లేరని, ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యం అని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడగా అందులో నటి ప్రత్యూష మరణించగా, సిద్దార్ధ్ ప్రాణాలతో బయటపడ్డారు.

ADVERTISEMENT

అయితే ఇది ఆత్మహత్య కాదని, తన బిడ్డను సిద్దార్ధ్ అత్యాచారం చేసి అనాయ్యంగా చంపేశారంటూ ప్రత్యుష తల్లి కోర్ట్ ని ఆశ్రయించగా, ఏళ్ళ పాటు సాగిన న్యాయపోరాటంలో సిద్దార్ధ్ కి హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పు పై సుప్రీం ని ఆశ్రయించాహ్రూ ప్రత్యుష తల్లి.

ప్రత్యూష కేసులో ప్రధమ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న సిద్దార్ధ్ నాలుగు వారాల గడువులోపు లొంగిపోవాలంటూ ఆదేశించిన సుప్రీం, గతంలో హై కోర్ట్ విధించిన రెండేళ్ల జైలు శిక్షణే ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. అయితే సుప్రీం తీర్పు పై గౌరవం ఉన్నప్పటికీ ఆ తీర్పు తమకు సంతృప్తికరంగా లేదంటూ ప్రత్యుష తల్లి తమ ఆవేదన వ్యక్తం చేసారు.

తన బిడ్డను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసారని మునుస్వామి కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ నివేదికను పక్కన పెట్టి తమ 23 ఏళ్ళ న్యాయపోరాటానికి ఫలితం లేకుండా సిద్దార్ధ్ రెడ్డికి రెండేళ్లు జైలు శిక్ష వేయడంతో ప్రత్యుష కు న్యాయం జరగలేదంటూ ఆమె తల్లి వాపోయారు.

అయితే సరిగ్గా ప్రత్యుష కేసు మాదిరే దశాబ్దాల పాటు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న మరోకుటుబం కూడా ఇంకా తమ బిడ్డ చావుకి న్యాయం జరగలేదు అంటూ తల్లడిల్లుతున్నారు. 20o7 డిసెంబర్ 27 న విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఒక హాస్టల్ బాత్రూంలో అత్యంత దారుణమైన స్థితిలో ఆయిషా మృతదేహం ఉమ్మడి ఏపీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

అయితే తమ బిడ్డకు జరిగిన ఈ అన్యాయానికి నిందితులకు కఠిన శిక్ష పడాలి, ఆయిషాకి న్యాయం జరగాలి అంటూ ఆమె కుటుంబ సభ్యులు కాళ్లరిగేలా ప్రభుత్వాల చుట్టూ తిరిగి తిరిగి ఇప్పటికి కోర్టుల చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నారు.

ఈ కేసులో 2010 లో సత్యంబాబు కి కోర్ట్ జీవిత ఖైదు విధించగా, 2017 లో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం సత్యంబాబుని విడుదల చేసింది. అయితే ఇక్కడ సత్యంబాబు కి ఆయిషా కేసుకి ఎటువంటి సంబంధం లేదని, అతడు అమాయకుడు అంటూ ఆయిషా తల్లి సత్యంబాబు వైపు నిలబడ్డారు.

ఎట్టకేలకు సత్యంబాబు నిర్దోషిగా బయటకొచ్చినప్పటికీ అసలు దోషులు ఇప్పటికి స్వేచ్ఛగా, సంతోషంగా సమాజంలో తిడుతూనే ఉన్నారని వారికీ న్యాయస్థానాలు కూడా ఎటువంటి శిక్షలు వేయలేకపోతున్నాయంటూ ఆయిషా తల్లి కూడా తన బిడ్దకు జరిగిన, జరుగుతున్న అన్యాయం పై దశాబ్దాలుగా గోషిస్తున్నారు.

మరి ఆ తల్లుల ఆవేదనకు, ఆ బాధితుల దారుణ హత్యలకు న్యాయం జరిగేదెక్కడ.? వారి ఆవేదనకు అడ్డుకట్ఠపడేదెలా.? అప్పుడు ప్రత్యుష, ఆ తరువాత ఆయిషా, ఇప్పుడు సుగాలిప్రీతి…ఇలా బాధితుల సంఖ్య పెరుగుతుంది కానీ దోషుల నేరాలు తగ్గడం లేదు.

ADVERTISEMENT
Latest Stories