సాక్షిలో హటాత్తుగా అమరావతిపై చర్చ దేనికంటే..

amaravati-project

జగన్‌ 5 ఏళ్ళ పాలనలో అమరావతిని పాడుబెట్టేసి రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం కలిగించిన కారణంగా అమరావతి గురించి సాధికారంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొని ఉంది. కనుకనే ఇంతకాలం వైసీపీ నేతలు అమరావతి గురించి పెద్దగా మాట్లాడింది లేదు.

ADVERTISEMENT

కనుక సాక్షిలో హటాత్తుగా అమరావతిపై చర్చ ఎందుకు జరిగింది?అదీ.. అమరావతి నిర్మాణ పనులు, కాంట్రాక్టుల గురించి చర్చించకుండా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారు?అంటే రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

తీవ్ర ఆర్ధిక పరిమితుల నడుమ సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి పనులు చకచకా జరిపిస్తున్నారు. అమరావతికి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తరలివస్తున్నాయి.

ఈ కారణంగా రాష్ట్రాన్ని ఏవిదంగా అభివృద్ధి చేయాలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాని చూసి నేర్చుకోమని వివిద రాష్ట్రాలలో ప్రతిపక్షాలు అధికార పార్టీలకు సూచిస్తున్నాయి. కనుక ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సహా దేశంలో సిఎం చంద్రబాబు నాయుడు పేరు మారుమ్రోగిపోతోంది. ఇది జగన్‌ జీర్ణించుకోవడం చాలా కష్టం.

కనుక సిఎం చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు సంపాదించి పెడుతున్న అమరావతిపై ఈవిదంగా దుష్ప్రచారం మొదలుపెట్టి ఉండొచ్చు.

అప్పుడు ఎలాగూ కేసులు నమోదవుతాయని జగన్‌కు తెలుసు. కనుక అమరావతి, అభివృద్ధిపై నుంచి అందరి దృష్టిని ఈవిదంగా పక్కదారి పట్టించి రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని, మీడియాని ప్రభుత్వం అణచివేస్తోందని, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య నానాటికీ తీవ్రమవుతోందనే భావన కల్పించేందుకే వైసీపీ హటాత్తుగా ఈ ఎత్తుగడని అమలుచేసినట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు జగన్‌ కోరుకున్నట్లే ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి కదా?

కనుక అమరావతి విషయంలో తప్పుగా మాట్లాడి జగన్‌ పరువు పోగొట్టుకున్నారా?ప్రజాగ్రహానికి గురవుతున్నారా? లేదా జగన్‌ విసిరిన ఈ ఉచ్చులో కూటమి ప్రభుత్వం చిక్కుకుందా?అనే ప్రశ్నకు ఎవరికివారు సమాధానం చెప్పుకోవలసిందే.

ADVERTISEMENT
Latest Stories