కవితకి టీ – న్యూస్, షర్మిలకు సాక్షి న్యూస్…!

Sharmila Kavitha Fight

ఏపీ, తెలంగాణ రాజకీయాలలో వైసీపీ, బిఆర్ఎస్ ల మిత్ర బంధం ఎంత బలంగా ఉందో అలాగే ఆ పార్టీలలో జరిగే అన్నా చెల్లెళ్ళ ఇంటి పోరు కూడా అంతే దృఢంగా ఉంది. వైసీపీ పై షర్మిల పోరు, బిఆర్ఎస్ పై కవిత ఫైరు రెండు ఒకే విధంగా కొనసాగుతున్నాయి.

షర్మిల ABN తో వైసీపీ పై తన తొలి బాణం సంధిస్తే, టీవీ 5 తో కవిత బిఆర్ఎస్ తో తన రాజకీయ యుద్ధం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ వైసీపీ కి ఎదురవుతున్న షర్మిల బాణాలను అడ్డుకోవడానికి జగన్ కు వైసీపీ కాలకేయ సోషల్ మీడియా సైన్యం తో పాటుగా సాక్షి న్యూస్ ఛానెల్ కూడా తోడుగా నిలబడింది.

ADVERTISEMENT

అలాగే అక్కడ బిఆర్ఎస్ ని కవిత నుండి కాపాడేందుకు కేటీఆర్ సోషల్ మీడియా సైన్యం కి తోడు బిఆర్ఎస్ గొంతుగా వినిపించే టీ – న్యూస్ సైతం గళం విప్పుతుంది. ఈ నేపథ్యంలోనే కవిత బిఆర్ఎస్ నేతల పై సాగిస్తున్న అవినీతి విమర్శల యుద్దాన్ని తిప్పికొట్టేందుకు టీ న్యూస్ రంగంలోకి దిగి కవిత కు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేసింది.

దీనితో కవిత సదరు టీవీ ఛానల్ మీద లీగల్ ఫైట్ కి సిద్ధమయ్యారు. అందులో భాగంగా కవిత టీ న్యూస్ కి లీగల్ నోటీసులు జారీ చేసారు. తన పై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు, తన పై బిఆర్ఎస్ నేత మాధవరం చేసిన వ్యాఖ్యలను పదేపదే ప్రచారం చేసినందుకు గాను టీ న్యూస్ పై కవిత లీగల్ పోరుకి రెడీ అయ్యింది.

అయితే గతంలో వైసీపీ ఆత్మసాక్షి సాక్షిలో సైతం షర్మిలకు వ్యతిరేకంగా కథనాలు, డిబేట్లు ప్రచారం చేసి అసలు షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి కే పుట్టిందా అంటూ ఆమె ఆత్మాభిమానం తో పాటు విజయలక్ష్మి ఆత్మ గౌరవాన్ని సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేసారు.

నాడు వైసీపీ సాక్షిలో షర్మిలకు వ్యతిరేక కథనాలు, నేడు బిఆర్ఎస్ టీ – న్యూస్ ఛానెల్ లో కవిత పై తప్పుడు వార్తలు, నాడు సాక్షి పై షర్మిల విమర్శలు, నేడు టీ న్యూస్ తో కవిత పోరాటాలు ఇలా ఈ అన్నా- చెల్లెళ్ళ కథలు ఒకే తీరుగా సాగుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories