మూడున్నరేళ్ళుగా రాజధాని కోసం లేని తొందర ఇప్పుడే ఎందుకు?

Supreme Courtఏ దేశామైనా, ఏ రాష్ట్రమైనా… ప్రజలైనా ‘మా రాజధాని ఇది…’ అని గర్వంగా చెప్పుకొంటారు. కానీ ఆంద్ర ప్రజలు చెప్పుకోలేకపోతున్నారు. పైగా రాజధాని ఎక్కడపెట్టుకోవాలో తేల్చుకొనేందుకు న్యాయపోరాటాలు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ర్యాలీలు కూడా చేయవలసివస్తోంది! వాటికి అధికారంలో ఉన్న మంత్రులే సారధ్యం వహిస్తుండటం మరీ విచిత్రం!

ADVERTISEMENT

ఈ పంచాయతీని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా సుప్రీంకోర్టుకి తీసుకువెళ్ళడంతో ఆంద్రా ప్రజలు సిగ్గుతో తలదించుకోవలసివస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఆంధ్రప్రదేశ్‌ పరువు ప్రతిష్టలకి సంబందించిన అంశంగా కాక కేవలం ఓ కేసు లేదా రాజకీయ అంశంగానే చూస్తుండటంతో సుప్రీంకోర్టు తలుపులు మళ్ళీ తట్టింది.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి, ఈ కేసుని విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కెఏం జోసఫ్‌, జస్టిస్ట్ నాగరత్నలతో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో అమరావతి రైతులు కూడా తమ వాదనలని వినిపించాలనుకొంటున్నారు. కనుక వారి అభ్యర్ధన మేరకు ఈ కేసు తదుపరి విచారణని ఫిభ్రవరి 23న చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది.

అయితే గత మూడున్నరేళ్ళుగా మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం చేసిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు తొందరపడుతోంది? అంటే మార్చి 3,4 తేదీలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగబోతుండటమే కారణంగా కనిపిస్తోంది.

ఢిల్లీ సమ్మిట్‌లో ఏపీకి విశాఖ రాజధాని అని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. కనుక మార్చిలో సమ్మిట్ ప్రారంభం అయ్యేలోగా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొంటే, సిఎం జగన్‌ విశాఖకి మకాం మార్చేసి “ఇదే మా రాష్ట్ర రాజధాని” పెట్టుబడిదారులకి చెప్పుకోగలుగుతారు.

కానీ ఒకవేళ సుప్రీంకోర్టు ఈ కేసు విచారణని మరికొంతకాలం పొడిగించినా లేదా హైకోర్టు తీర్పుని సమర్ధించినా మార్చిలో జరుగబోయే సదస్సులో సిఎం జగన్‌ ఇబ్బందికర పరిస్థితులని ఎదుర్కోవలసివస్తుందనే విషయం మరిచిన్నట్లున్నారు. కనుక రాజధాని కేసు విచారణని వేగవంతం చేయమని కోరడం తప్పనే భావించవచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమకి అనుకూలంగా తీర్పు వస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నట్లుంది. వస్తే మంచిదే కానీ లేకుంటే చేజేతులా విమర్శలు, అవమానాలు తెచ్చిపెట్టుకొన్నట్లే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories