ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి దాదాపు 9 నెలలుగా జైల్లో మగ్గుతున్న రాజ్ కసిరెడ్డి తనకు రెగ్యులర్ బెయిలు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అయితే కసిరెడ్డి తన బెయిలు కోసం హైకోర్టు ని ఆశ్రయించాహగా కాసిరెడ్డికి బైలు ఇచ్చేందు హైకోర్టు నిరాకరించింది. దీనితో ఇక చేసేది లేక తన అదృష్టాన్ని అపరిక్షించుకోవడానికి కసిరెడ్డి సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
తనకు ఈ కేసులో రెగ్యులర్ బెయిలు ఇవ్వాలంటూ కసిరెడ్డి పెట్టుకున్న అభ్యర్థనను ధర్మాసనం పూర్తిగా నిరాకరించింది. 750 కోట్లకు సంబంధించిన కుంభకోణంలో 9 నెలలు జైలు అనేది పెద్ద విషయమే కాదంటూ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఉన్న త్రిసభ్యకమిటీ వ్యాఖ్యానించింది.
ఈ లిక్కర్ కేసులో కసిరెడ్డి ప్రదం సూత్రధారుడిగా ఉన్నారని, అటువంటి కీలక వ్యక్తికీ ఇటువంటి సమయంలో రెగ్యులర్ బెయిలు మంజూరు చేస్తే అది కేసు విచారణను ప్రభావితం చేస్తుందని, ఈ విషయంలో తమ జోక్యం ఉండదు అంటూ సుప్రీం ధర్మశనం తేల్చిచెప్పింది.
దీనితో కనీసం ఇప్పుడైనా బైలు మీద బయటకు రావచ్చు అని కలలు కన్న కసిరెడ్డి కలలు పగటి కలలుగా మిగిలిపోయాయి. అలాగే కసిరెడ్డి తరుపు వాదనలు వినిపించేందుకు న్యాయవాది కాస్త సమయం కోరగా ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు.
అయితే ఈ లిక్కర్ స్కాం కేసులో పలు వైసీపీ నేతలు ఇప్పటికే అరెస్టయ్యి బైలు మీద బయటకొచ్చారు. అందులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పలువురున్నారు.






