అప్పుడు బిఆర్ఎస్ మౌనం… ఇప్పుడు టిడిపి!

kcr-jagan-chandrababu-naidu-revanth-reddy

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయి 11 ఏళ్ళు కావస్తున్నా ఏదో ఓ విదంగా అవినాభావ సంబంధాలు కనిపిస్తూనే ఉన్నాయి. కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌, చంద్రబాబు నాయుడుని గద్దె దించేందుకు జగన్‌కి సహకరిస్తే, తెలంగాణ ఎన్నికలకు టిడిపిని దూరంగా ఉంచడం ద్వారా చంద్రబాబు నాయుడు రేవంత్‌ రెడ్డికి పరోక్షంగా తోడ్పడటం రెండు చక్కటి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇచ్చినమ్మ వాయినం… పుచ్చుకొన్నమ్మ వాయినం అని సింపుల్‌గా చెప్పుకోవచ్చు.

ఇలా ఇచ్చి పుచ్చుకోవడాలే కాదు… ఒక్కోసారి రెండు రాష్ట్రాలలోని పార్టీల మద్య మౌన పోరాటాలు కూడా జరుగుతుంటాయి.

ADVERTISEMENT

ఉదాహరణకు జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు మూతులకు తాళాలు వేసుకుని పరోక్షంగా జగన్‌ నిర్ణయానికి మద్దతు తెలిపారు.

అదేవిదంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం కాంగ్రెస్‌ మంత్రి కొండా సురేఖపై యుద్ధం ప్రకటిస్తే, టిడిపి మౌనంగా ఉండిపోయింది.

అంటే చంద్రబాబు నాయుడు వారిని సమర్ధిస్తున్నట్లు కాదు. అలాగని కొండా సురేఖని వెనకేసుకువస్తున్నట్లు కాదు. అంటే ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్‌-ఇరాన్ బాంబులు వేసుకుంటుంటే భారత్‌ నిశితంగా గమనిస్తున్నట్లన్న మాట!

సిఎం చంద్రబాబు నాయుడు తలుచుకుంటే సినీ పరిశ్రమలో పెద్దలతో మాట్లాడి వారి స్పీడుకి బ్రేకులు వేయగలరు. కానీ అలా చేస్తే బిఆర్ఎస్ నేతలకి చేజేతులా అవకాశం కల్పించిన్నట్లవుతుంది. కనుక ఈ సినీ విమర్శల కాంగ్రెస్‌కి కొంత నష్టం జరుగుతున్నప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడు ఆ వివాదంలో వేలు పెట్టే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్‌-బిఆర్ఎస్ పార్టీలే ఆ సంగతి తేల్చుకుంటాయని దూరంగా ఉండిపోయారు. బహుశః రేవంత్‌ రెడ్డి కూడా అదే కోరుకొని ఉండవచ్చు.

ADVERTISEMENT
Latest Stories