విడాకులు ఉండవు… 15 ఏళ్ళు కలిసి కాపురం పక్కా!

Nara Lokesh addressing party workers on TDP Janasena BJP alliance unity

ప్రతీ రాజకీయపార్టీలో లుకలుకలు ఉంటాయి. పదవులు, టికెట్లు, నియోజకవర్గంలో పట్టు కోసం నాయకుల మద్య కీచులాటలు జరుగుతూనే ఉంటాయి.

మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి-రోజా, కాకాణీ గోవర్ధన్-అనిల్ కుమార్‌ ఇలాంటి రాజకీయ కాంబినేషన్‌లు అన్ని పార్టీలలో కనిపిస్తాయి.

ADVERTISEMENT

ఓ పార్టీలో నాయకులే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు చూసుకుంటున్నప్పుడు, మూడు భిన్నమైన సిద్దాంతాలు, ఆలోచనలు కలిగిన టీడీపి, జనసేన, బిజేపిల భిన్నమైన పార్టీలలో నాయకులు సొంత ప్రయోజనాలు చూసుకోకుండా ఉండరు కదా? చూసుకుంటున్నప్పుడు వారి మద్య కూడా తప్పక కీచులాటలు జరుగుతూనే ఉంటాయి.

కానీ లేవు. ఉండవంటే ఎవరూ నమ్మరు. మంత్రి నారా లోకేష్‌ కూడా ఇదే విషయం కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.

శుక్రవారం బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలోమాట్లాడుతూ, “మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్ని అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. వాటిని మనం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుందాము. అంతే తప్ప మిత్ర పక్షాల మద్య విడాకులుండవు. మిస్ ఫైర్‌లు ఉండవు. అలాగే క్రాస్ ఫైరింగ్‌లు కూడా ఉండవు.

పవనన్న స్వయంగా మనం మరో 15 ఏళ్ళపాటు ఇలాగే కలిసిమెలిసి పనిచేద్దామని చెపుతున్నారు. మన మూడు పార్టీల మద్య చిచ్చుపెట్టడానికి ‘టీమ్‌ 11 క్యాప్టెన్’ నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నారు. కనుక మనం ఆయనకు ఆ అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు మన మద్యలో పుల్లలు పెడుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ మనం వారి ఉచ్చులో చిక్కుకోకూడదు.

గ్రామ స్థాయిలో మీ మద్య ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి. అదేవిధంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా మూడు పార్టీల నేతలు కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకుందాం. మూడు పార్టీలు కలిసి ముందుకు సాగడం ఎంత అవసరమో రాష్ట్రాభివృద్ధికి మరో 15 ఏళ్ళు మనమే అధికారంలో ఉండటం కూడా అంతే అవసరమని మీలో ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోండి,” అని మంత్రి నారా లోకేష్‌ కార్యకర్తలకు హితవు పలికారు.

దిశా నిర్దేశం అంటే ఇదీ! రప్పా రప్పాలని ప్రోత్సహించడం కాదు!

ADVERTISEMENT
Latest Stories