జగనన్న ప్రత్యేక విమానానికి సాంకేతిక లోపం… బ్యాక్ టూ తాడేపల్లి!

ys jaganసిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం 5.03 గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి గన్నవరం విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు.

సాంకేతిక లోపం తలెత్తిన తర్వాత విమానం సుమారు 20-25 నిమిషాలు గాలిలో ఉంది. విమానంలో సిఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సిఎస్ జవహార్ రెడ్డి, ఉన్నతాధికారులు కృష్ణ మోహన్ రెడ్డి, చిందానంద రెడ్డి, పూనం మాలకొండయ్య, ఎంపీ మిధున్ రెడ్డి ఉన్నారు.

ADVERTISEMENT

మంగళవారం ఉదయం ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో వారు పాల్గొనవలసి ఉంది కనుక ఈరోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున వేరే విమానంలో వారు ఢిల్లీ బయలుదేరబోతున్నట్లు తాజా సమాచారం.

ADVERTISEMENT
Latest Stories