హైదరాబాద్‌లో షర్మిల హడావిడి మామూలుగా లేదుగా!

YS-Sharmila-Arrestసుమారు ఏడాదిపైగా వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నా ఏనాడూ ఆమెని ఎవరూ గుర్తించలేదు. అధికార, ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. తెలంగాణలో టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలే ప్రధానపార్టీలు కనుక ప్రజలు కూడా ఆమె పాదయాత్రని పెద్దగా పట్టించుకోలేదు.

కానీ గత వారం పదిరోజులుగా ఆమె హటాత్తుగా వార్తలకెక్కుతున్నారు. ఈరోజు ఉదయం ఆమె హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్దకి చేరుకొని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమరణ నిరాహారదీక్షకి కూర్చోవడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. తన పాదయాత్రకి హైకోర్టు అనుమతించినా పోలీసులు అనుమతించనందుకు నిరసనగా ఆమె దీక్షకి కూర్చోన్నట్లు చెపుతున్నారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకి చేరుకొని ఆమెని అదుపులోకి తీసుకొని బలవంతంగా వ్యానులోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ హడావుడి కూడా మీడియా బాగానే కవర్ చేసింది. కనుక ఆమెను బలవంతంగా తరలిస్తున్న ఫోటోలు, వీడియోలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ మీడియాలో కూడా వచ్చే అవకాశం ఉందనే భావించవచ్చు.

ADVERTISEMENT

కొన్ని రోజుల క్రితం ఆమె వరంగల్‌ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే అనుచరులు ఆమె వాహనాలపై దాడి ధ్వంసం చేయడంతో ఈ నాటకీయ పరిణామాలు చకచకా మొదలయ్యాయి. మర్నాడు ఆమె తన కారుతో, కార్వాన్‌తో ప్రగతి భవన్‌ వద్దకు బయలుదేరినపుడు పోలీసులు రాజ్‌భవన్‌ వద్ద ఆమెని అడ్డుకొన్నారు. కానీ ఆమె కారులో నుంచి బయటకు రమ్మనమని పోలీసులు ఎంత బ్రతిమాలినా ఆమె డోర్స్, అద్దాలు లాక్ చేసుకొని లోపల కూర్చోండిపోయారు. దాంతో చేసేదేమీలేక ఆమెను ఆ కారుతో అలాగే క్రేన్‌ సాయంతో ఎస్ఆర్ నగర్‌లో పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

ఆమెని ఆవిదంగా తరలిస్తున్నప్పుడు విలేకరులు తీసిన ఫోటోలు, వీడియోలు విస్తృతంగా మీడియాలో రావడంతో ప్రధాని నరేంద్రమోడీ దృష్టిలో కూడా పడ్డాయి. తర్వాత ప్రధాని నరేంద్రమోడీ ఆమెకి ఫోన్‌లో చేసి సానుభూతి తెలిపినట్లు, వీలైతే ఢిల్లీ వచ్చి కలవాలని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిసినప్పుడు ఆయన వైఎస్ షర్మిల విషయం గురించి అడిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ వాటిని బిజెపి, వైసీపీలు దృవీకరించలేదు. అది వేరే సంగతి.

ఇవాళ్ళ ట్యాంక్‌బండ్‌ మీద ఆమరణ దీక్ష పేరుతో మరోసారి వైఎస్ షర్మిల మీడియాయ దృష్టిని బాగానే ఆకర్షించినట్లు అర్దమవుతోంది. ఇంతకాలం ఆమె కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేసినా దక్కని గుర్తింపు హైదరాబాద్‌లో రెండు రోజులు హడావుడి చేస్తే దక్కింది. ఈవిషయం ఆమె కూడా బాగానే గుర్తించినట్లున్నారు. అందుకే ఆమె పాదయాత్ర ఆపేసిన వరంగల్‌ జిల్లాకి వెళ్ళి అక్కడ నిరసన తెలుపకుండా హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌ మీద హడావుడి చేసినట్లున్నారు.

ఆమె ఇటీవల ఢిల్లీ వెళ్ళివచ్చిన తర్వాత నుంచే హడావుడి పెరిగిందని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తుంటే, ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌, ఆమె ముగ్గురూ కలిసే ఈ డ్రామాని రక్తి కట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమె తన పార్టీ కోసమే తాపత్రయపడితే అర్దం చేసుకోవచ్చు కానీ టిఆర్ఎస్‌ కోసమో బిజెపి కోసమో పావులా మారి ఇటువంటి డ్రామాలు ఆడుతుంటే చివరికి తానే నష్టపోతానని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories