
ఉక్రెయిన్‌పై రష్యా మూడున్నరేళ్ళుగా దాడులు చేస్తుంటే, దానిని ఆ దేశాల మద్య జరుగుతున్న యుద్ధంగానే చూసిన ట్రంప్, తాను తలుచుకుంటే ఒక్క రోజులో ఆ యుద్ధం నిలిపివేయగలనని గొప్పగా చెప్పుకున్నారు.
కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఆపించాలంటే ఉక్రెయిన్‌లో అరుదైన ఖనిజాలు తవ్వుకునేందుకు అమెరికాని అనుమతించాలని డోనాల్డ్ ట్రంప్ షరతు విధించడం చెయ్యి మెలిపెట్టి ఒప్పించే ప్రయత్నమే.
Also Read – బీజేపీ వాదానికి మూడు పార్టీల మద్దతు…
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మొదట అందుకు ఒప్పుకోనప్పటికీ తర్వాత దేశం, ప్రజల కోసం అందుకు సిద్దపడ్డారు. అయినా ట్రంప్ రష్యాని ఆపలేకపోయారు. నేటికీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తూనే ఉంది.
ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తుంటే, ట్రంప్ మళ్ళీ ఇలాంటి ప్రతిపాదనే చేశారు. ఇరాన్ తమ దేశంతో అణు ఒప్పందం చేసుకుంటే, ఒక్క రోజులో యుద్ధం ఆపించేస్తానని లేకుంటే ఇరాన్ సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు.
Also Read – చంద్రబాబు-రేవంత్ సమావేశం వైసీపీ, బీఆర్ఎస్ జీర్ణించుకోగలవా?
కానీ భారత్‌పై తరచూ పాక్ ఉగ్రదాడులు చేస్తూ ఎంతో మందిని బలి గొంటుంటే ట్రంప్‌కు అదో పెద్ద తప్పుగా అనిపించలేదు.
కానీ ఆ కారణంగా పాక్‌పై భారత్ దాడులు చేయగానే వెంటనే ట్రంప్ జోక్యం చేసుకొని పాక్‌ని కాపాడేశారు.. అని స్వయంగా గొప్పగా చెప్పుకున్నారు. పైగా యుద్ధం మద్యలో పాకిస్థాన్‌కి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అత్యవసరంగా భారీ ఆర్ధిక సాయం అందేలా చేశారు కూడా.
Also Read – ఇండోసోల్ నిర్వాసితులను జగనే కాపాడాలట!
తద్వారా అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చేసి వేలాదిమంది ప్రాణాలను బలిగొన్న ‘ఒసామా బిన్ లాడెన్’కు పాకిస్థాన్ ప్రభుత్వమే తమ దేశంలో ఆశ్రయం కల్పించిందనే విషయం గుర్తులేనట్లు ట్రంప్ వ్యవహరించారు.
కానీ తమ దేశంవైపు ఇరాన్ కన్నెత్తి చూసినా ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించడానికి వెనుకాడనని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ ద్వంద వైఖరికి ఇది అద్దం పడుతోంది.
ట్రంప్ ఏవిదంగా ఇరాన్ బారి నుంచి తమ దేశాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారో, ఆదేవిదంగా భారత్, ఉక్రెయిన్ దేశాలు కూడా తమని తాము కాపాడుకోవాలనుకుంటున్నాయని ట్రంప్‌కి తెలియదా?
ఓ పక్క యుద్ధాలు చేస్తూ, చేయిస్తూ యుద్ధ సమయంలో బాధిత దేశాలతో ఈవిదంగా ట్రంప్ బేరసారాలు చేయడాన్ని ఏమనుకోవాలి?
అయినా యుద్ధంతో యుద్ధమే వస్తుంది తప్ప ఎన్నటికీ శాంతి రాదని ఆఫ్ఘనిస్తాన్, వియత్నాంలో అమెరికా నేర్చుకున్న గుణాపాఠాలు ఎప్పటికప్పుడు మరిచిపోతూ అమెరికా అధ్యక్షులు యుద్ధం-శాంతి స్థాపన ఏక కాలంలో చేసేస్తుంటారు.