చెల్లికి తీరని అన్యాయం చేశాడు నా కొడుకు: విజయమ్మ లేఖ

Vijayamma open letter

ఏ బంధుత్వాలు లేని వారు నేడు కలిసిమెలిసి పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కుటుంబ విలువలు, అనురాగాలు, ఆప్యాయతలు, బంధుత్వాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు సిఎం చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్‌ దంపతులు… వారి కుటుంబాలు.

కానీ ‘ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టుల కీడ్చిన ఘనుడు నా కొడుకు జగన్మోహన్ రెడ్డి’ అని తల్లి విజయమ్మ స్వయంగా చెప్తున్నారు. ‘ఆస్తుల విషయంలో చెల్లికి, ఆమె పిల్లలకు కూడా అన్యాయం చేస్తున్నాడు నా కొడుకు,’ అని విజయమ్మ ఓ బహిరంగ లేఖ విడుదల చేయడం సంచలనం సృష్టిస్తోంది.

ADVERTISEMENT

విజయమ్మ బహిరంగ లేఖ సారాంశం: నా భర్త వైఎస్ మరణం వరకు ఆస్తుల పంపకాలు జరుగలేదు. ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. వాటిని తన నలుగురు మనుమలకు సమానంగా పంచాలని నా భర్త కోరుకున్నారు. ఆయన ఆదేశం కూడా అదే! ఈ విషయం మా సన్నిహితులందరికీ తెలుసు.

నా భర్త కోరిక మేరకు నా కొడుకు చెల్లి షర్మిలకు ఆస్తులు పంచి ఇచ్చాడు కానీ పూర్తిగా ఇవ్వలేదు. అలాగే తన మేనల్లుడు, మేనకోడలికి కూడా నా కొడుకు అన్యాయం చేశాడు.

ఏనాటికైనా న్యాయం చేస్తాడని ఓ తల్లిగా ఆశిస్తున్నాను. నిజమేమిటో నాకు, నా కొడుకుకి, నా దేవుడికే తెలుసు. దేవుడి సాక్షిగా చెపుతున్న మాటలివి. మా వ్యవహారంలో దయచేసి బయటవారు జోక్యం చేసుకోవద్దు! మా దేవుడు మాకు తప్పక న్యాయం చేస్తాడు.

ఇటీవలే విజయమ్మ ‘నేను షర్మిలకి బినామీని కాను” అని కోర్టుకి చెప్పుకోవలసి రావడమే సిగ్గుచేటు అనుకుంటే, మీడియా ఎదుట కొడుకుని ముద్దులాడుతూ ఫోటోలు దిగే ఆ తల్లే ఇప్పుడు, నా కూతురికి, మనుమలకు నా కొడుకు అన్యాయం చేశాడంటూ జగన్మోహన్ రెడ్డి అసలు రూపాన్ని బయటపెట్టారు.

కొడుకు గురించి తల్లి విజయమ్మ కొన్ని విషయాలు బయటపెడితే, ‘బాబాయ్ వివేకానంద రెడ్డి వలన ఎప్పటికైనా సమస్య తప్పదని గ్రహించి లేపేశారంటూ,” అన్న… అయన వెనకేసుకు వస్తున్న అవినాష్ రెడ్డి గురించి చెల్లి షర్మిల మరో కొత్త విషయం ఇటీవలే బయటపెట్టారు.

తల్లికి, చెల్లికి అన్నం పెట్టనివాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడా? అవును చేయిస్తాడని వైసీపీ నేతలు చెపుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories