సాయి రెడ్డి సొంత పార్టీకి దూరమవుతున్నారా?

Vijay_sai_Reddy_Chandrababu_Naiduవైసిపిలో తిరుగులేని నేతగా గతంలో చెలామణి అయిన విజయసాయి రెడ్డి ఆ పార్టీకి క్రమంగా దూరం జరుగుతున్నారా? గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలును నిన్న తారకరత్న పార్థివ దేహం చెంత జరిగిన విషయాలతో కలిపి చూస్తే ఆ అనుమానాలు కలగడం సహజమే.

వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి అధికారంలోకి వచ్చిన సంవత్సరం వరకు ఆ పార్టీలో జగన్ రెడ్డి తర్వాతి స్ధానం సాయి రెడ్డిది మాత్రమే. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ఆయన మాట దాదాపు శాసనమే. తర్వాత ఏం జరిగిందో ఏమెూ కానీ నెమ్మదిగా ఆయన అధికారాలు తగ్గిస్తూ వస్తున్నారు. యల్జీ పాలిమర్స్ దుర్ఘటన సమయంలో ముఖ్యమంత్రి కారు నుండి ఆయనను దింపేసే వీడియెూ బయటకు రావడం మెుదటిగా ఆయన ప్రాధాన్యం తగ్గిస్తున్న విషయం చర్చకు వచ్చింది. ఆ తరువాత అనేక పరిణామాలు జరిగాయి. వాటిపై గతంలో మిర్చి9 కూడా విశ్లేషణలు ఇచ్చింది.(క్రింది లింకులో చదవవచ్చు).

ADVERTISEMENT

సాయి రెడ్డికి పొమ్మనలేక పొగబెడుతున్నారా… ?

ఇటువంటి పరిస్ధితులలో నిన్నటి తారకరత్న అంతిమ కార్యక్రమాల వద్ద జరిగిన సంఘటనలు మాత్రం అనూహ్యం. సాయిరెడ్డి నందమూరి, నారా కుటుంబ పెద్దలతో అత్యంత సన్నిహితంగా మెసలుతూ, మీడియా కన్నుల్లో పడే ప్రయత్నాలు మాత్రం ఊహించని పరిణామాలు. గతంలో ఇదే సాయిరెడ్డి సోషల్ మీడియా ఎకౌంట్ల నుండి నందమూరి, నారా కుటుంబాలు, వ్యక్తుల మీద చేసిన నీచమైన కామెంట్లు తెలుగుదేశం కార్యకర్తలు, నందమూరి అభిమానులు జీవితంలో మరిచిపోలేనివి. ఆయన ట్విట్టర్ ఎకౌంట్ అయితే రెట్టల ఎకౌంట్ అన్ని వర్గాల నుండి విమర్శలు ఎదుర్కొంది. ఆయన ఆద్వర్యంలో నడిచే వైసిపి సోషల్ మీడియా పెట్టిన పోస్టులైతే అత్యంత నీచం. అటువంటి వ్యక్తి జూ. ఎన్టీఆర్ నుండి, బాలయ్య, చంద్రబాబు మెుదలైన వారితో మెలగిన తీరు ఎవరూ ఊహించినది. ఇక చంద్రబాబు వద్ద తనకు తానుగా వచ్చి పక్కన కూర్చుని మాట కలపడం, ఆయన ప్రెస్ మీట్ లో వెళ్లి పక్కన నిలబడటం, ఆయన వెళ్లిపోయే సమయంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి వారిస్తున్నా తోసుకుంటూ బాబు కారులోకి వెళ్లడం వంటివి కెమేరాల సాక్షిగా అందరూ వీక్షించారు.

మామూలుగా ఐతే ఇవి ఆ సందర్భంలో పెద్దగా అభ్యంతరం కాని విషయాలు కానీ ఆ ఇంటి మహిళలను కూడా వదలకుండా సోషల్ మీడియాల్లో ఆయన పెట్టిన పోస్టులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై కేసులతో వేదించిన తీరు, అంతకు మించి రెండు పార్టీల మద్య ఉన్న మెహాలు కూడా చూసుకోలేనంత పెరిగిన రాజకీయ వైరం నేపథ్యంలో ఆయన ప్రవర్తన రెండు పార్టీ శ్రేణులను అయెూమయానికి గురిచేసింది. ఇక్కడ అన్నిటి కంటే ముఖ్యంగా చెప్పుకోవలసింది వైసిపి అధినేత దీనిని ఎలా తీసుకుంటారు అనేది? కేవలం అయ్యన్నపాత్రుడిని కలిసారనే అనుమానంతో దళిత డాక్టర్ సుదాకర్ ను వేదించి, వెంటాడి చివరకు ఆయన చనిపోయే పరిస్ధితి కలిపించిన విషయం ఇంకా కళ్ళ ముందే కదులుతుంది. ఇంగ్లీషు మీడియం వల్ల నష్టం కలుగుతుంది అని తన ఆలోచనలకు విరుద్ధంగా హితవు చెప్పబోయిన సొంత పార్టీ నాయకుడు, అత్యున్నత చట్టసభ సభ్యుడు అయిన రఘురామ రాజు గారిని చిత్రహింసలు పెట్టించిన విధానం అసలు మరచిపోలేం. అటువంటిది తన జీవితంలో ఎలాగైనా జైలుకు పంపాలని రేపగలు తల బద్దలు కొట్టుకుంటున్న చంద్రబాబుతో ఇంత చనువుగా వెళ్లడాన్ని సహిస్తారా, సాయిరెడ్డిపై ఎటువంటి స్పందనలు ఉంటాయనేది అందరూ ఆలోచిస్తున్న విషయం. వాస్తవానికి జగన్ రెడ్డి గురించి సాయిరెడ్డికి తెలిసినంతగా మరొక వ్యక్తికి తెలియదంటే అతిశయెూక్తి కాదు. జగన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యానికి ప్రతి ఇటుక సాయిరెడ్డి పేర్చిందే అనేది అందరూ చెప్పుకునే మాట, ఆ క్రమంలో జరిగిన ప్రతి పరిణామానికి ఆయనే సాక్షి. ఇక 2014 తరువాత ఢిల్లీ స్ధాయి నాయకులను మచ్చిక చేసుకోవడం నుంచి గల్లీ సోషల్ మీడియా వరకు ప్రతి అడుగూ సాయిరెడ్డిదే. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటి వైసిపి అధికారం సాయిరెడ్డి రెక్కల కష్టం, బ్రెయిన్ చైల్డ్. అటువంటి వ్యక్తి నిన్నటి సంఘటన ద్వారా పార్టీ నాయకత్వానికి ఏమైనా సందేశం ఇవ్వదలచుకున్నారా? మీరు నన్ను దూరం పెడితే నేను వొంటరిని కాదని నిరూపించదలచుకున్నారా? ఇప్పటికే తన ఢిల్లీ పలుకుబడి చూపించి కొన్ని పార్లమెంటరీ కమిటీల్లో స్ధానం పొంది తన బలం చాటిన ఆయన, ఇప్పుడు రాష్ట్రంలో కూడా తన మార్కు చూపిస్తున్నారా? గత కొంత కాలంగా ఆయన తన స్వబావానికి విరుద్ధంగా ఎటువంటి చెడు ట్లీట్లు పెట్టకపోవడం, తారకరత్న హాస్పటల్ లో ఉన్నప్పుడు పరామర్శించి బాలయ్యను పొగడటం, నిన్న కూడా నందమూరి, నారా కుటుంబాలను పొగుడుతూ మేమంతా ఒక కుటుంబం అనే విదంగా మాట్లాడటం వంటివి పలు ప్రశ్నలు రేకెత్తించాయి. ఒకపక్క నందమూరి కుటుంబాన్ని మంచి చేసుకుంటూ, మరోపక్క వైసిపికి హెచ్చరికలు పంపే విధంగా ఒక్క దెబ్బకు రెండు పిట్టల ఆట ఆడుతున్నారా? ఇప్పుడు వైసిపి నాయకత్వం సాయిరెడ్డితో పాచప్ చేసుకుంటుందా లేక తెగేదాకా లాగుతుందా అనేది తెలియాలంటే మరి కొద్దికాలం వేచిచూడాల్సిందే!

-శ్రీకాంత్.సి

ADVERTISEMENT
Latest Stories