ఇటీవల సిఎం చంద్రబాబు నాయుడు ఓ సభలో మాట్లాడుతూ, “గొడ్డలి పార్టీ నేతలను ప్రభుత్వమే శిక్షించాల్సిన అవసరం లేదు. వారు చేసుకున్న ఖర్మలే వారిని శిక్షిస్తాయి,” అని అన్నారు.
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన స్వయంగా పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయడం, పోలీసులు వారిపై గృహహింస సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడంతో సిఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
నాడు అధినేత జగన్ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి ప్రయత్నించి జోగి రమేష్ ఓ కేసులో ఇరుక్కున్నారు. దీనికి సంబంధించి ఆయనఫై ఓ కేసు నమోదైంది. ఆ కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో తెలీదు. కానీ దాంతో జోగి రమేష్‌కు ఉచిత పబ్లిసిటీ మాత్రం లభించింది.
కానీ ఇప్పుడీ తాజా కేసుతో జోగి రమేష్, అయన కుటుంబం పరువు గోదాట్లో కలిసింది. ఆయన కోడలు చేసిన ఆరోపణలు, ముఖ్యంగా.. తన భర్త సంసారానికి పనికిరాడనే సంగతి దాచిపెట్టి బలవంతంగా పెళ్ళి చేయడం తదితర అంశాల గురించి మీడియాలో వస్తున్న వార్తలు జోగి కుటుంబాన్ని సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తున్నాయి.
ఈ గృహ హింస కేసులో జోగి కుటుంబం మొత్తం జైలుకి వెళ్ళే పరిస్థితి నెలకొనడం, ఆయన రాజకీయ జీవితానికి సమాధి కట్టినా ఆశ్చర్యం లేదు.
జైల్లో ఉన్నవారిని పరామర్శించేందుకు బయలుదేరే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఈ కేసులో ఇరుక్కున జోగి రమేష్ కుటుంబాన్ని ఇంత వరకు పరామర్శించలేదు.
కనుక జోగి రమేష్ ఒంటరి పోరాటం చేయక తప్పడం లేదు. అదృష్టవశాత్తు ఇలాంటి తీవ్రమైన కేసులో కూడా ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ లభించడం విశేషమే. కానీ ఇకపై ఈ కేసు నడుస్తూనే ఉంటుంది. కనుక విచారణ సాగుతున్న కొద్దీ జోగి రమేష్ కుటుంబం గురించి మీడియాలో కథకథలుగా వినిపిస్తూనే ఉంటాయి.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వైసీపీ నేతలపై ప్రభుత్వం పనిగట్టుకొని కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. వైసీపీ నేతల ఖర్మ ఫలం వారికి ఏదో రూపంలో తిరిగి వస్తూనే ఉంటుంది. దానిని వారు అనుభవిస్తూనే ఉంటారు.





