ఇటు జోగి..అటు పిన్నెల్లి…మరి అందగాళ్లెవరు.?

Who Are Jagan’s Next ‘Andagallu’

వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో జగన్ చేసిన అందగాళ్ళ ప్రకటన వైసీపీ ని ఇక అందమైన కుటుంబంగా మార్చేసింది. అటు పిమ్మట వైసీపీ నుంచి ఏ ఒక్క నేత అరెస్టయిన వారిని వైసీపీ అందగాళ్ళు అంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ అందమైన కుటుంబం నుంచి ఈ అందగాళ్ళ జాబితాలో చోటు దక్కించుకోవడానికి నకిలీ మద్యం కేసుతో జోగి బ్రదర్స్, గుండ్లపాడు జంట హత్యల కేసుతో పిన్నెల్లి బ్రదర్స్ పోటీపడుతున్నారు.

ADVERTISEMENT

అయితే ఇందులో ఏ జంట అన్నదమ్ములను జగన్ అందగాళ్లుగా పరిగణించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది, అలాగే ఏ ఇద్దరి జంటకు జగన్ పరామర్శల యాత్ర దక్కుతుంది అనేది చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే నకిలీ మద్యం కుంభకోణం కేసులో జోగి బ్రదర్స్ అరెస్టయ్యి జైల్లో బెయిలు కోసం పోరాడుతున్నారు.

ఇక తాజాగా ఈ జంట హత్యల కేసులో బెయిలు మీద బయటకొచ్చిన పిన్నెల్లి బ్రదర్స్ నేడు కోర్టులో లొంగిపోయారు. ఇక ఈ కేసులో ఏ -6 గా ఉన్న పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఏ – 7 గా ఉన్న ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామి రెడ్డి న్యాయస్థానం ఆదేశాలతో కోర్ట్ లో లొంగిపోయారు.

అయితే కోర్ట్ వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక జోగి బ్రదర్స్ విషయంలో కూడా తాజాగా న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇలా ఇటు జోగి బ్రదర్స్ అటు పిన్నెల్లి బ్రదర్స్ తమ అరెస్టులతో జగన్ దృష్టిలో అందగాళ్లుగా గుర్తింపు పొందుతారా.? లేదా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories