ఇదివరకు సింహంలా గర్జించే కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉండిపోతున్నారు? ఇదివరకు తెలంగాణ అంతా నాదే అన్నట్లు వ్యవహరించిన కేసీఆర్ బోనులో సింహంలా ఫామ్‌హౌస్‌లో నుంచి ఎందుకు బయటకు రావడం లేదు?
Also Read – సెప్టెంబర్-14 వీరిద్దరికి సమ్ థింగ్ స్పెషల్..!
ఆయన ప్రాణం పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వరదలలో చిక్కుకొని విలవిలలాడుతున్నా ఎందుకు స్పందించడం లేదు?అంటూ ఒకటే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రాజకీయాలలో, సినిమాలలో, సోషల్ మీడియాలో ఉంటే ఇదే పెద్ద ఇబ్బంది. నోరు విప్పి నాలుగు ముక్కలు మాట్లాడితే గిట్టనివాళ్ళు కోడిగుడ్డుకి ఈకలు పీకే ప్రయత్నం చేసిన్నట్లు వాటిలో తప్పులు వెతికి పట్టుకొని విమర్శిస్తుంటారు.
Also Read – రజని తో రాజీ…జరిగే పనేనా.?
అలాగని మాట్లాడకపోయినా ఇబ్బందే. ఎందుకు మాట్లాడటం లేదని ఇలా నిలదీస్తుంటారు. చివరికి సోషల్ మీడియా అకౌంట్‌లో ‘డీపి’ మార్చుకున్నా ఊహాగానాలు మొదలైపోతాయి.
సామాన్యులకు ఈ కష్టాలు ఉండవు కనుక వారికి ఈ కష్టాలు అర్దం కావు. కానీ కేసీఆర్ వంటివారికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు.
Also Read – అధికారంలో ఉన్నప్పుడే గడప గడపకి వెళ్ళలేదు!
మొదట్లో తుంటి ఎముక విరిగిందని కేసీఆర్ బయటకు రాలేదు. సరే! “తర్వాత శాసనసభ సమావేశాలకు ఎందుకు రాలేదు?” అని రేవంత్ రెడ్డి, మంత్రులు నిలదీయని రోజంటూ లేదు.
శాసనసభ తర్వాత లోక్‌సభ ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినందున కేసీఆర్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు కనుక బయటకు రాలేదని గిట్టనివారు సైతం సర్ధి చెప్పుకున్నారు.
ఆ తర్వాత కూడా కేసీఆర్ బయటకు రాకపోతే ‘పాపం కూతురు కవిత కోసం దిగులు పడ్డారు అందుకే బయటకు రావడం లేదని’ మళ్ళీ గిట్టనివాళ్ళే సర్ధి చెప్పుకున్నారు.
అయితే ఇప్పుడు ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది కదా? అయినా కేసీఆర్ రాష్ట్రంలో వరదలు వస్తే ఎందుకు స్పందించడం లేదు?ఫామ్‌హౌస్‌లో నుంచి ఎందుకు బయటకు రావడం లేదు? అని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సైతం ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో ఆయన కుమారుడు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండటం కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలకు కలిసి వచ్చిందనే చెప్పాలి. వరదల గురించి కేటీఆర్ మాట్లాడకపోయి ఉంటే కాంగ్రెస్ నేతలు కూడా ఆయనని పట్టించుకుని ఉండేవారు కారు.
కానీ కేటీఆర్ అక్కడి నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటంతో, రాష్ట్రంలో వరదలు వస్తే, కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. తండ్రీ కొడుకులకు రాష్ట్రం, ప్రజల సంగతి పట్టకపోయినా పనిచేస్తున్న మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజమే కదా?