ఒడ్డున కూర్చొని విమర్శలెందుకు సార్!

Why Retired IPS Nageshwar Rao Targets Modi, Chandrababu

ఓ కుటుంబాన్ని నడపడమే కత్తిమీద సాము వంటిదైతే, ఓ రాష్ట్రాన్ని దేశాన్ని నడపడం ఇంకెంత కష్టం? ఒక ఇంట్లోనే అందరి ఆలోచన, కోర్కెలు, అవసరాలు, సమస్యలు ఒకలా ఉండవు.

అలాంటిది అనేక భాషలు, కులాలు, మతాలు, జాతులతో నిండిన 150 కోట్లు పైగా జనాభా కలిగిన భారతదేశాన్ని నడిపించడం ఎంత కష్టం? అని ఆలోచించేవారు తక్కువ. కానీ చంద్రబాబు నాయుడు, మోడీ ప్రభుత్వాలను విమర్శించేవారే ఎక్కువ. ఎందుకంటే, అదే తేలిక కనుక!

ADVERTISEMENT

తెలంగాణకు చెందిన మాజీ ఐపిఎస్ అధికారి ఎం నాగేశ్వర రావు ప్రధాని మోడీ పాలన, పనితీరుపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మంత్రి నారా లోకేష్‌ మరో సమాంతర రాజకీయ శక్తిగా మారుతున్నారన్నారు. వైసీపీ పాలనకు, కూటమి పాలనకు పెద్దగా తేడా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. దేశంలో కేరళ తప్ప ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలన్నీ రాజకీయ ఊబిలో కూరుకుపోతున్నాయని నాగేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ ఏపీలో అమరావతి, ఐటి కంపెనీలు, పెట్టుబడులు, కొత్తగా రైల్వే లైన్లు, ఆరు వరుసల రోడ్లు వస్తున్నాయి కదా? దౌర్జన్యాలు, అరాచకాలు, అవినీతి, బూతులు తగ్గి అభివృద్ధి, పాలన గురించే ఇప్పుడు ఎక్కువ జరుగుతోంది కదా?

ఏపీ గురించి ఏం చెప్పుకునా సొంత డప్పు అనవచ్చు. కానీ ఇరుగు పొరుగు రాష్ట్రాలు చివరికి యూపీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాయి కదా?

నిజమే! దేశంలో, రాష్ట్రాలలో రాజకీయాలు పెరిగిపోయాయి. అవినీతి పెరిగిపోయింది. కనుక విమర్శలు చేస్తున్న నాగేశ్వర రావు వంటి మేధావులు వాటికి పరిష్కారం చూపాలి కదా?

తెలంగాణలో ఐపిఎస్ అధికారిగా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఇటువంటి మార్పు కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలోకి వచ్చారు.

కానీ అందరిపై విమర్శలు గుప్పిస్తున్న ఈ మాజీ ఐపిఎస్ అధికారి నాగేశ్వర రావు ఈ రాజకీయ ఊబిలో నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ఏం ప్రయత్నం చేస్తున్నామని ఆలోచించాలి కదా?

మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కాస్త ఫ్లాష్ బ్యాక్ కూడా చూడటం చాలా అవసరం. ఒకప్పుడు అంటే.. కాంగ్రెస్‌ పాలనలో దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి? ఇప్పుడు ఏవిధంగా ఉన్నాయి?

ఒకప్పటికీ ఇప్పటికీ దేశంలో మౌలిక వసతులు పెరిగాయా అలాగే ఉన్నాయా? ఒకప్పుడు తరచూ దేశంలో ఎక్కడో అక్కడ ఉగ్రదాడులు జరుగుతూనే ఉండేవి. ఇప్పుడూ అలాగే జరుగుతున్నాయా? తగ్గయా?

భారత్‌ని ఇప్పుడు పాక్‌ కన్నెత్తి చూడగలదా? అని ప్రధాని మోడీని విమర్శించే నాగేశ్వర రావు వంటివారు గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రశ్నించుకోవాలి.

ఒకప్పుడు సాధారణ ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు తిరుగుతుంటే అవే పదివేలు అని సరిపెట్టుకునేవారు దేశ ప్రజలు. కానీ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చిన 65 సంవత్సరాల తర్వాత అంటే… మోడీ వచ్చిన తర్వాతే ‘బులెట్ రైలు’ ఆలోచన ఆచరణ రూపంలోకి వస్తోంది కదా?

ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకునే నాధుడే లేడు. కనుక పొరుగునే ఉన్న చైనా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ వారిని ఉగ్రవాదం వేర్పాటువాదానికి ప్రేరేపించగలిగేవి. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జమ్ముకాశ్మీర్‌తో సహా ఈశాన్యరాష్ట్రాలకు రైలు, రోడ్ కనెక్టివిటీ ఏర్పడింది కదా?

ఇప్పుడే ఈశాన్య రాష్ట్రాలకు మౌలిక వసతులు ఏర్పాటు అవుతున్నాయి. కనుక ఇప్పుడు అక్కడి ప్రజలు గతంలో కంటే ఇప్పుడు భారత్‌తో ఎక్కువ కనెక్ట్ అవుతున్న మాట వాస్తవమా? కాదా? ఐపీఎస్‌ అధికారిగా చేసిన నాగేశ్వర రావుకి తెలియదనుకోలేము. వారికే తెలుసు.

ఏ ప్రభుత్వంలోనైనా తప్పులు, లోపాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ వాటిని మాత్రమే చూస్తూ మంచిని చూడలేకపోవడం, చూస్తున్నా చూడనట్లు నటించడం అంటే కళ్ళున్నా గంతలు కట్టుకొని కుమారుల తప్పులను చూడకుండా పాండవులలో లోపాలు చూసిన గాంధారి అనే అనుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories