ఏపీ ఎన్నికల కురుక్షేత్రం అమరావతా.?

Will Amaravati Decide the Future of Andhra Politics?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి vs వైసీపీ మధ్య జరుగుతున్న రాజకీయ కురుక్షేత్రానికి అమరావతి వేదిక కానుందా.? ఏపీ భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలకు ఇరు పార్టీల మధ్య రాజధాని అమరావతి అభివృద్ధి వారధి కానుందా.?

నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి దుస్థితి చూసిన ఏపీ ప్రజలు నేడు రాజధాని అమరావతిలో పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులను చూస్తున్నారు.

ADVERTISEMENT

అలాగే రాజధాని ఏకీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ముందుకెళ్తున్న కూటమి విధానాల పై ఇటు మూడు పార్టీలకు ఒక అవగాహన ఉంది అలాగే ఇటు ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కానీ నాడు మూడు రాజధానులు అంటూ అమరావతిని సమాధి చేసిన వైసీపీ ఇప్పటికి ఆ ప్రాంతం పై అక్కడి ప్రజల పై విషం చిమ్ముతూనే ఉంది.

ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా.? అంటూ అంబటి సంధించిన ప్రశ్నలు, అమరావతి ముంపు ప్రాంతం అంటూ వైసీపీ చేస్తున్న విష ప్రచారాలు, అమరావతి కళ మూన్నాళ్ళ ముచ్చటే అంటూ ప్రచురిస్తున్న నీలి మీడియా కథనాలు అన్ని కలిపి రాజధాని అమరావతి పై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పకనే చెప్పాయి.

దీనితో భవిష్యత్ లో ఏపీలో వైసీపీ 2.0 అధికారంలోకి వచ్చినా జగన్ 2.0 పాలన ఎదురయినా అమరావతి అభివృద్ధి ఏమవుతుందో.? రాష్ట్ర భవిష్యత్ ఎటు పోతుందో అన్న ఆందోళన ప్రతి ఒక్కరిని తొలిచేస్తోంది. ఇటువంటి సందర్భంలో రాబోయే ఎన్నికలకు అమరావతి అభివృద్దే కీలకం కానుంది.

అమరావతి భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర భవితవ్యాన్ని పరిగణలోకి తీసుకుని ప్రతి ఒకరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన పరిస్థితి రాబోయే ఎన్నికలలో ఉంటుంది. అయితే 2014 లో విభజన గాయాలు ఎన్నికలను ప్రభావితం చేయగా,

2019 ప్రత్యేక హోదా ఏపీ ఓటర్లను ఆకర్షించింది. ఇక ఏపీ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని 2024 ఎన్నికలు పోలింగ్ ని పరుగులు పెట్టించింది. అలాగే ఏపీకి భవిష్యత్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికలు అమరావతి కేంద్రంగా బ్యాలెట్ బాక్స్ ను బలపరచనుంది.

ADVERTISEMENT
Latest Stories