వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కేసులో రెండో అధ్యాయం ప్రారంభం

 YCP MLC Anantha Babu case second chapterడ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పరారిలో ఉన్న ప్రధాన నిందితుడు కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ఈరోజు సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు. ఈ విషయం కాకినాడ అదనపు ఎస్పీ శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. ప్రస్తుతం అతనిని విచారిస్తున్నామని, ఈ హత్య ఎలా జరిగిందనే విషయం తెలుసుకున్న తరువాత పూర్తి వివరాలు తెలియజేస్తామని మీడియా ప్రతినిధులకు చెప్పారు.

ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు లొంగిపోవడంతో ఈ కేసులో మొదటి అధ్యాయం పూర్తయింది. అతను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కనుక ఈ కేసు నుంచి బయటపడేస్తారో లేక పార్టీ నుంచి బహిష్కరిస్తారో రెండో అధ్యాయంలో తెలుస్తుంది.

ADVERTISEMENT

ఈ కేసులో కూడా కాకినాడ పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన రోజున అతనితోనే ఉన్న అతని ఇద్దరు స్నేహితులు పవన్, సుబ్రహ్మణ్యంలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. దీంతో వారిద్దరి కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది. వెంటనే వారి తల్లితండ్రులు కాకినాడ ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఫిర్యాదు చేయగా, వారిద్దరూ తమ వద్దే ఉన్నారని ఈ కేసుకు సంబంధించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు వారిని తీసుకువచ్చామని, విచారణ పూర్తి కాగానే ఇద్దరినీ ఇంటికి పంపించేస్తామని హామీ ఇచ్చారు. ఇక చేసేదేమీ లేక వారి తల్లితండ్రులు ఇళ్లకు వెళ్ళి తమ కుమారుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories