
సాక్షి ఛానల్లో అమరావతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైసీపీ అధినేత జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆమె చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర విభజన జరిగి అప్పుడే 11 ఏళ్ళు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి నెలకొని ఉంది. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం పూనుకొని అమరావతి నిర్మిస్తుంటే వైసీపీ సొంత మీడియా సాక్షిలో ఈవిదంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు.
Also Read – యావత్ దేశం దృష్టి విశాఖ పైనే…
ఇంట్లో చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ‘సారీ’ చెప్పమని సూచిస్తుంటాము. అటువంటిది వైసీపీ సొంత మీడియా, అదీ.. జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిగారు ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మీడియాలో ఓ తప్పు జరిగితే వారిద్దరూ తప్పు జరిగిందని ఒప్పుకొని, ప్రజల మనోభావాలు దెబ్బ తీసినందుకు క్షమించమని అడిగితే తప్పు కాదు. కనుక ఇప్పటికైనా వారిరువురూ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి,” అని వైఎస్ షర్మిల అన్నారు.
ఇదివరకు సాక్షి మీడియాకు జగన్‌కి, సాక్షి మీడియాకు వైసీపీకి ఏమిటి సంబంధం అని వైసీపీ నేతలు ప్రశ్నించేవారు. ఇప్పుడు కూడా సాక్షి మీడియాతో సంబంధం లేదని, కొమ్మినేని, కృష్ణంరాజు అలా మాట్లాడటం తప్పే.. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని వైసీపీ నేతలు చెప్పి ఉండి ఉంటే ఎంతో హుందాగా ఉండేది.
Also Read – షర్మిల ఫోన్ కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?
కానీ వైసీపీ ఎప్పటిలాగే రాజకీయ కక్ష సాధింపు, మీడియాపై రాక్షస మూకల దాడులు అంటూ ఎదురుదాడి చేస్తోంది. ఇప్పుడు వైసీపీకి చెందినవారే సాక్షి మీడియాపై టీడీపీ దాడులు చేయిస్తోందని, ఇది తప్పని వాదిస్తున్నారు.
చివరికి వారి కుటుంబానికి చెందిన వైఎస్ షర్మిల కూడా వారిని తప్పు సరిదిద్దుకోమని హితవు చెపుతున్నారు కదా? ఈ విషయంలో కొందరు జైళ్ళకు వెళ్ళి కోర్టుల చుట్టూ తిరిగితే ఆ పేరుతో రాజకీయాలు చేస్తూ మైలేజ్ పొందవచ్చని జగన్ భావిస్తున్నట్లయితే ఇంత కంటే నీచ రాజకీయాలు మరొకటి ఉండవు.
Also Read – జగన్ రెచ్చిపోతున్నారు..పవన్ పత్తాలేరు.?
ఈ కేసులో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు కానీ పాము తన పిల్లలని తానే తింటుందన్నట్లు జగన్ తన రాజకీయ కోసం సొంత పార్టీ నేతలను, తనకు బాకా ఊదుతున్న సొంత మీడియాలో వ్యక్తులను కూడా బలిపెట్టేందుకు వెనుకాడటం లేదని ఎవరైనా గ్రహించారో లేదో?
వారికి అండగా ఉంటామని, జైలుకి వెళితే పరామర్శించడానికి వస్తామని చెప్పుకోవడం కాదు. జరిగిన తప్పుకి రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా అమరావతి ప్రజలకు జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటే సరిపోతుంది కదా?