హోదా లేకుంటే బాయ్కాట్ – హోదా ఉంటె వాకౌట్.?

YSRCP leaders staging protest and walkout in Andhra Pradesh Assembly and Legislative Council amid opposition status controversy

వైసీపీ రాజకీయం పదవి కోసమా.? ప్రజల కోసమా.? అంటే రెండిట్లో ఒక్కదానికి కూడా ఒకే చెప్పలేని పరిస్థితి. వై నాట్ 175 అంటూ నాడు వైసీపీ చేసిన రచ్చకి ప్రజలు 11 తో సరిపెట్టారు.

అయితే ఆ 11 కే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, లేకుంటే అసెంబ్లీ ని బాయ్కట్ చేస్తాం అంటూ నాటి నుంచి నేటి వరకు ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యే లు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించనూలేదు.

ADVERTISEMENT

ఇక వైసీపీ ఎమ్మెల్యే ల పరిస్థితి ఇలా అసెంబ్లీ హాజరుపట్టికి – మీడియా సమావేశాలకు మధ్య ఊగిసలాడుతుంటే, అటు శాసనమండలిలో బలమున్న వైసీపీ తన ఎమ్మెల్సీ లతో వాకౌట్ రాజకీయం మొదలుపెట్టింది.

శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ప్రజల తరుపున ప్రభుత్వానికి ప్రశ్నలు అంటూ మొదలుపెట్టి మంత్రులిచ్చే ప్రభుత్వ సమాధానాలు వినకుండానే వాకౌట్ పేరుతో చట్ట సభల నుంచి బయటకువెళిపోతున్నారు.

అసెంబ్లీ లో నేమో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు కాబట్టే మేము చట్టసభలకు రావడం లేదు అంటూ చెప్పుకుంటున్న వైసీపీ, ఒకవేళ వచ్చినా తమకు బలం లేకవడం వల్ల అసెంబ్లీ లో తమ గళం వినిపించేందుకు తగిన సమయం లభించదు, దాని వల్ల మేము సభలకు వచ్చినా రాకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు అంటూ జగన్ మీడియా సమావేశాలతో పని కానిచ్చేస్తున్నారు.

కానీ శాసనమండలిలో వైసీపీ ప్రతిపక్ష హోదాకు అవసరమైన బలం ఉంది, వైసీపీ గొంతు బలంగా వినిపించేంత బలగము ఉంది. అయినా వైసీపీ వాకౌట్ పేరుతో ఎందుకు సభను బహిష్కరిస్తున్నట్టు.? అంటే వైసీపీ చెపుతున్న ప్రకటనలకు చేస్తున్న చర్యలకు ఎటువంటి సంబంధం లేదు నేడు స్పష్టమవుతుంది.

అంటే వైసీపీ కి హోదా నో పదవో ముఖ్యం కాదు చట్టసభలకు వెళ్ళడానికి వైసీపీ కి కావాల్సింది అధికారం. ఆ అధికారంతో ప్రతిపక్ష నేతల గొంతు నొక్కాలి, వారిని తమ బూతు రాజకీయాలతో కించపరచాలి, వారి పై రాజకీయ కక్ష్య సాధింపులు చెయ్యాలి, వారిని అడ్డుపెట్టుకుని వారి కుటుంబంలోని మహిళలను అగౌరవపరచాలి, అదేనా వైసీపీ అంతిమ ధ్యేయం.?

అందుకునేలా వైసీపీ 2.0 అంటూ జగన్ రప్ప రప్ప రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.? వచ్చేది మేమే, ఏడూ సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం అంటూ జగన్ చేస్తున్న రాజకీయ ప్రకటనలు, వైసీపీ నాయకులు వాడుతున్న భాషా సంప్రదాయాలు, అలాగే ఆ పార్టీ క్యాడర్ అనుసరిస్తున్న రప్ప రప్ప నినాదాలు వాటినే సూచిస్తున్నాయా.? వాటి అమలుకే తెగబడుతున్నాయా.?

ADVERTISEMENT
Latest Stories