అమరావతిలో న్యాయమూర్తుల నివాసాలు రెడీ

Newly constructed judges’ bungalows in Amaravati near Andhra Pradesh High Court complex

ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు ఉంది కానీ న్యాయమూర్తులకు నివాసాలు లేవు. కనుక విజయవాడ లేదా పరిసర ప్రాంతాలలో తాత్కాలికంగా వారికి వసతి ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కనుక ప్రభుత్వం వారి కోసం అమరావతిలో మొత్తం రూ.69 కోట్లు వ్యయంతో 24 ఎకరాల విస్తీర్ణంలో 36 బంగ్లాలు నిర్మిస్తోంది. విశాలమైన రోడ్లు, పక్కనే పచ్చటి చెట్లతో చక్కటి కాలనీలుగా నిర్మిస్తోంది.

ఒక్కో బంగ్లా మొత్తం 6,300 చదరపు గజాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో నిర్మిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ 4600 చ.అడుగులు, మొదటి అంతస్తు 2240 చ.అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తోంది. వీటిలో ప్రధాన న్యాయమూర్తితో సహా ఉన్నత పదవులలో ఉన్నవారి కోసం 15 ప్రీమియం సూట్స్ నిర్మిస్తోంది.

ADVERTISEMENT

ప్రతీ బంగ్లాకు వెనుకవైపు 700 చ.అడుగులు విస్తీర్ణంలో సర్వెంట్ క్వార్టర్, ముందువైపు 310 చ.అడుగులు విస్తీర్ణంలో సెక్యూరిటీ రూమ్స్ కూడా నిర్మిస్తోంది. ఇప్పటికే వీటి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన కొద్దిపాటి పనులు కూడా పూర్తయిన తర్వాత సిఎం చంద్రబాబు నాయుడు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ అయ్యి చర్చించిన తర్వాత వీటిని న్యాయమూర్తులకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.

అమరావతి ప్రస్తుతం హైకోర్టు ఉన్న నేలపాడులోనే రూ.1,048 కోట్లు ఖర్చుతో 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+7 అంతస్తులుగా హైకోర్టు శాశ్విత భవన నిర్మాణం సాగుతోంది. దీనిలో మొత్తం 52 కోర్టు హాల్స్ ఉంటాయి. ఏడవ అంతస్తులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories