ఏపీ నాయకుల పౌరుషం ఏపీకి మాత్రమేనా.?

Pawan Kalyan and Amaravati at the center of a political debate as Telangana leaders criticize Andhra Pradesh politics and leadership.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలలో తరచూ తెలంగాణ వారిని చూసి ఏపీ వారు నేర్చుకోవాలి అంటూ వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఏ విషయంలో తెలంగాణ వారిని చూసి ఏపీ నాయకులు నేర్చుకోవాలి అనే అంశం వస్తే ప్రస్తుతం ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద తెలంగాణలో జరుగుతున్న ప్రాంతీయవాద రాజకీయాన్ని గమనిస్తే అర్ధమవుతుంది.

ఒక రాజకీయ విశ్లేషకుడు ముసుగులో తన పై చేసిన నిరాధారమైన ఆరోపణల పై స్పందించినందుకు తెలంగాణలో అధికార, విపక్ష పార్టీలన్నీ ఏకమై పవన్ మీద విరుచుకుపడుతున్నాయి. అలాగే తెలంగాణ జర్నలిస్టుల పేరుతో పవన్ పై వ్యక్తిగత దాడులు చేస్తున్నారు.

ADVERTISEMENT

ఇక రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ ఏర్పాటు చేసిన నవ నిర్మాణ సభ పై ఇటు అధికార కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యే లు పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు చేస్తున్నారు.

అలాగే అటు తెరాస పార్టీతో పాతసీసాలో కొత్త పచ్చడి అన్నట్టుగా తెలంగాణ రాజకీయాలలోకి వచ్చిన కవిత ఏకంగా పవన్ తో పాటుగా ఏపీ రాజధాని అమరావతి పైన కూడా పరిధి దాటి మాట్లాడుతున్నారు. తాజాగా టీడీపీ పార్టీ నిర్వహించిన మహానాడు లో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ తెలంగాణలో కూడా టీడీపీ పురోగతి కి చర్యలు అంటూ ప్రకటించారు.

దీనితో ఇక పవన్, లోకేష్ టార్గెట్ గా కవిత విమర్శల దాడి మొదలుపెట్టింది. వాన కాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి సీటు కింద నీళ్లు రాకుండా చూసుకోండి, ప్రతి వానా కాలం ఏపీ రాజధాని మునిగిపోతుంది,ఇప్పటికి ఆంధ్రా నాయకులు వైద్యం కోసం హైద్రాబాద్ కి వస్తున్నారు, ఇది ఏపీ ప్రజలకు అవమానం కాదా.?

ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికి 13 ఏళ్ళు గడిచినా ఇంకా రాష్ట్రానికి రాజధాని నిర్మాణం జరగలేదు. ఇప్పటికి ఏపీలో రెండు ప్రభుత్వాలు మారాయి, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అయినా ఏపీ రాజధాని మీద స్పష్టత లేదు అంటూ కవిత అమరావతి టార్గెట్ గా కూడా విమర్శలు సంధించారు.

జగన్ మావిగన్ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద రాజకీయ బాంబ్ అంటూ టీడీపీ, జనసేన టార్గెట్ గా ముందుకెళ్లారు. అయితే తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నాయకులు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల మీద, రాష్ట్ర రాజధాని మీద అవాకులు చవాకులు పేలుతున్నా ఏపీ నుంచి మాత్రం ఎటువంటి ఖండన కనిపించదు, ఎటువంటి ఎదురుదాడి వినిపించదు.

ఒక రాజకీయ విశ్లేషకుడు మీద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక్క ప్రతివిమర్శ చేస్తే ఇంతా యాగీ చేస్తున్న తెలంగాణ రాజకీయ నాయకుల పై ఏపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు.? వైసీపీ నేతల పై గొడ్డలి అంటూ విరుచుకుపడే టీడీపీ కి కవిత మాటలు వినిపించడం లేదా.?

టీడీపీ మీద వెన్నుపోటు అంటూ రప్ప రప్ప నినాదాలతో రెచ్చిపోయే వైసీపీ కి వైసీపీ హయాంలో కూడా రాష్ట్రానికి రాజధాని నిర్మించలేకపోయారు అంటూ కవిత చేస్తున్న హేళనలు కనిపించడం లేదా.? తెలంగాణ నాయకులు చేస్తున్న ప్రాంతీయవాద రాజకీయాన్ని తిప్పికొట్టే బాధ్యత ఏపీ బీజేపీ నేతలకు లేదా.?

ఇలా తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ అస్తిత్వాన్ని కాపుడుకోవడానికి తెలంగాణ అనే ప్రాంతీయవాదాన్ని ఒక రాజకీయ కవచంలా వాడుకుంటున్నారు, ఆ కవచంతో ఏపీ ప్రజల మనోభావాలను పొడుస్తున్నారు, ఇక్కడి రాజకీయ నాయకులకు రిటర్న్ గిఫ్టులు ఇస్తున్నారు. కానీ ఏపీ నుంచి మాత్రం….

ADVERTISEMENT
Latest Stories