టెట్ పరీక్షల నిర్వహణ మంచి నిర్ణయమే!

AP TET 2026: In-Service Teachers Must Clear TET by 2028

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సిద్ధమవుతోంది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, 2011 కంటే ముందు నియమితులై ఇప్పటివరకు టెట్ అర్హత సాధించని ఉపాధ్యాయులందరూ 2028 ఆగస్టు 31 లోగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఈ ప్రత్యేక పరీక్షకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ 2026 ఆగస్టు 25 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 24 వరకు కొనసాగుతుంది. అర్హులైన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 21 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతకు, భవిష్యత్తులో వచ్చే ప్రమోషన్లకు ఈ పరీక్షలో అర్హత సాధించడం అవసరం.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు 40 శాతం (60 మార్కులు) , బీసీ అభ్యర్థులకు 50 శాతం (75 మార్కులు), ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం (90 మార్కులు) క్వాలిఫైయింగ్ మార్కులుగా నిర్ణయించారు.

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా వైసీపీ తప్పు పడుతోంది. తమిళనాడులో విజయ్‌ ప్రభుత్వం ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపునిస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపెడుతుంటే, ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్ష నిర్వహిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటోందని విమర్శిస్తోంది.

కానీ రేపు సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పు పడుతూ, స్టే విదిస్తే ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని అర్ధమవుతోంది.

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ పరీక్షలోఅర్హత సాధించడం కాస్త కష్టం కావచ్చు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ కోణంలో అవి తీసుకునే నిర్ణయాల వలన తమ ఉద్యోగాల విషయంలో ఆందోళన చెందడం కంటే ఒక్కసారి ఈ పరీక్షలో అర్హత సాధిస్తే జీవితాంతం నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా?

ADVERTISEMENT
Latest Stories