ఎవరు సాధిస్తే వారికే సొంతమా.?

BRS Regional Politics Row Rekindles Andhra-Telangana Debate

బిఆర్ఎస్ పార్టీ పేరు మారిన ఆ పార్టీలో ప్రాంతీయ వాదం మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి దశాబ్దం గడిచిపోయినా ఇప్పటికి తెలంగాణలో బిఆర్ఎస్ రాజకీయం చెయ్యాలి అంటే ఆంధ్రా పేరు తలవాల్సిందే, ఆంధ్రా నాయకులను విమర్శించాల్సిందే..!

కేసీఆర్ ఎన్నో పోరాటాల ఫలితం, ఎన్నో త్యాగాల సాధనే తెలంగాణ ఆవిర్భావం అంటూ డిసెంబర్ – 9 న ‘విజయ్ దివస్’ పేరు మీద బిఆర్ఎస్ జరుపుకుంటున్న వేడుకలలో ప్రసంగించిన బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ దీక్ష ఫలితంగా పొందిన తెలంగాణను నేడు తిరిగి ఆంధ్రోళ్ల చేతులలో పెట్టె ప్రయత్నం జరుగుతుందంటూ ఏపీ పై మరోసారి విషం కక్కారు.

ADVERTISEMENT

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ తెలంగాణలోని విలువైన ప్రభుత్వ భూములను వేలం వేస్తూ వాటి హక్కులను తిరిగి ఆంధ్రోళ్ల పరం చేస్తున్నారంటూ వాపోతున్న బిఆర్ఎస్, కేసీఆర్ ఉద్యమం చేయడంతో, నిరాహార దీక్ష చేపట్టడంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది కాబట్టి తెలంగాణ మీద సర్వ హక్కులు కేసీఆర్ కే సొంత అన్నట్టుగా వాదిస్తున్నారు.

అయితే అసలు చెన్నై లో కలిసి ఉన్న తెలుగు వారందరికీ కలిపి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ 42 రోజుల పాటు తన నిరాహార దీక్షతో అప్పటి ప్రభుత్వంతో పోరాడి తన ప్రాణాన్ని సైతం కోల్పోయారు అమరవీరుడు పొట్టి శ్రీ రాములు. ఇప్పుడు ఆంధ్ర – తెలంగాణ అంటూ రాజకీయం చేస్తున్న ఈ సోకాల్డ్ రాజకీయ నేతలందరూ పొట్టి శ్రీరాముల గారి సొంతమైన తెలుగు జాతిని రెండుగా చీల్చలేదా.?

నేడు కేసీఆర్ ఉద్యమ ఫలితంగా వచ్చిన తెలంగాణను ఆంధ్రోళ్లకు అప్పగిస్తున్నారు అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చకొడుతున్న నేతలు నాడు పొట్టి శ్రీ రాముల ప్రాణ త్యాగ ఫలితంగా వచ్చిన తెలుగు జాతి పై రాజకీయ హక్కుని తీసుకోలేదా.? ఆయన ప్రాణ త్యాగంతో ఆవిర్భవించిన ఉమ్మడి ఆంధ్రపద్రేశ్ పై బిఆర్ఎస్ కు రాజకీయ హక్కు ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు వ్యాపార అవకాశం ఉండకూడదా.?

ఎవరి పోరాటాల ఫలితం వారికే సొంతం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎవరి సొంతం అవ్వాలి..? అక్కడ రాజకీయం ఎవరి హక్కుగా మారాలి.? అసలు బిఆర్ఎస్ కి ఆంధ్రప్రదేశ్ అంటే ద్వేషమా.? లేక టీడీపీ అంటే అసూయా.? బిఆర్ఎస్ లో ఉన్న అభద్రతా భావం, బాబు పై ఉన్న రాజకీయ ద్వేషమే ఈ ప్రాంతీయ వాద రాజకీయానికి కారణమా.?

ADVERTISEMENT
Latest Stories