ఏపీలో సజ్జల చెప్పిందే వేదం… అయితే బాస్ ఎవరు గురూ?

Chandrababu-Naidu-Sajjala-Ramakrishna-Reddy
సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం ప్రభుత్వ సలహాదారే అయిన్నప్పటికీ, రాష్ట్రంలో పోలీసులతో సహా అన్ని శాఖలపై ఆయనే పెత్తనం చలాయిస్తుంటారని ఇటీవల వైసీపీ నుంచి బయటకి వచ్చిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. తనపై వైసీపీ నేతలనీ, పోలీసులని ఉసిగొల్పడం వంటి చవుకబారు ఐడియాలు ఆయనవేనని నాకు తెలుసునని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

టిడిపి, జనసేన పార్టీలు కూడా చాలా కాలంగా సజ్జల రామకృష్ణారెడ్డిపై ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. శుక్రవారం అనపర్తి పట్టణంలో చంద్రబాబు నాయుడు రోడ్ షోని పోలీసులు అడ్డుకోవడం, ఆ ప్రయత్నంలో టిడిపి కార్యకర్తలపై చితకబాదడం వంటివి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే జరిగాయని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లోనే పోలీసులు పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.

ADVERTISEMENT

మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకి పోలీసులు తమపట్ల ఇంత దురుసుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో, వారిపై ఎటువంటి ఒత్తిళ్ళు ఉంటాయో తెలుసు గనుకనే వారినీ మందలిస్తూనే, వారి మెడపై కత్తి పెట్టి తమపైకి ఉసిగొల్పవద్దని సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరించారనుకోవచ్చు. రాష్ట్ర పోలీసులకి సజ్జల రామకృష్ణారెడ్డి బాసులాగ వ్యవహరించడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. తన సభలని, వాటికి హాజరయ్యేవారిని పోలీసులతో అడ్డుకొనే ప్రయత్నం చేయడం చూస్తుంటే తన సభలకి అపూర్వమైన జనాధారణ చూసి వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు అర్దమవుతోందని చంద్రబాబు నాయుడు అన్నారు.

“అనాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు తన ప్రభుత్వం కూడా ఇలాగే పోలీసులని పెట్టి అడ్డుకొని ఉంటే ఒక్క అడుగు ముందుకు వేయగలిగేవారా”అని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, టిడిపి నేతలు అడుగుతున్న ప్రశ్నకి వైసీపీలో సజ్జలతో సహా ఏ ఒక్కరూ సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే అది వాస్తవం కనుక!

మాజీ కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఈరోజు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు సభలని అడ్డుకోవడం వలన వైసీపీకే నష్టం తప్ప ఆయనకి కాదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో వేయడం వలన ప్రజలలో ఆయన పట్ల సానుభూతి పెరిగింది. తత్ఫలితంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అడ్డుకొంటే అదే జరుగుతుంది,” అని కుండ బద్దలుకొట్టిన్నట్లు చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories