Minister Chelluboina Venugopala Krishnaఆంధ్రప్రదేశ్‌ గురించి రాష్ట్ర ప్రజలకి కూడా తెలియని కొన్ని గొప్ప విషయాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బయటపెట్టారు. అదేమంటే, దేశంలో అత్యధికంగా పెట్టుబడులని ఆకర్షిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమట! జూలై 2022నాటికి భారత్‌కి రూ.171 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే, వాటిలో రూ.40,361 కోట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే వచ్చాయట! వాటిలో రూ.23,985 కోట్ల పెట్టుబడులకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందట! ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీ ముందు తెలంగాణ కూడా బలాదూరేనట! ఇక రాష్ట్ర జీఎస్‌డీపీ 11.34 శాతం, తలసరి ఆదాయం 38.5 శాతంతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధికంగా దూసుకుపోతోందట! కానీ ఇవన్నీ తెలియని కొందరు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీలంకలా దివాళా తీయబోతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి తేల్చి చెప్పారు.

ఆయన తన సాటి మంత్రులకి కూడా తెలియని మరో విషయం కూడా చెప్పారు. రాజధానితో ఏ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావని ప్రభుత్వం పనితీరు చూసే వస్తాయని చెప్పారు. కనుక విశాఖలో రాజధాని ఏర్పాటుకి, పెట్టుబడులు, పరిశ్రమలు రావడానికి ఎటువంటి సంబందం లేదని తేల్చి చెప్పేసినట్లే.

Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకే సిఎం జగన్‌ మూడు రాజధానులతో పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణకి పూనుకొన్నారని, సాహసోపేతంగా ఆయన తీసుకొంటున్న నిర్ణయాలు, పనితీరుని చూసే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా ప్రవహిస్తున్నాయని మంత్రి చెల్లుబోయిన చెప్పారు.

ఏపీకి వేల కోట్ల పెట్టుబడులు వచ్చిపడుతుంటే నేటికీ యువత హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకి ఎందుకు వలసలు పోతున్నారు? రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నా, ఐ‌టి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతున్నా రాష్ట్ర వృద్ధిరేటు, జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం అన్ని ఎలా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి?ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధికంగా పటిష్టంగా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతోంది? తిరిగి వారి ఖాతాలలో సొమ్ము ఎందుకు తీసి వాడుకొంటోంది? కేంద్రం ఇస్తున్న పంచాయతీ నిధులని ఎందుకు పక్కదారి పట్టిస్తోంది? నెలనెలా ఎడాపెడా ఎందుకు ఎప్పులు చేస్తోంది?అనేవి జవాబు దొరకని భేతాళ ప్రశ్నలే కదా?వీటికి సమాధానం చెప్పాలంటే వైసీపీలో ఎవరికీ మొహం చెల్లబోదు!

Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?