అన్న దేశాన్ని ఏలుతుంటే తమ్ముడు జైలు పాలు?

ED Attaches Anil Ambani Assets in ₹40,000 Cr Case

ముఖేష్ అంబానీ పరోక్షంగా దేశాన్ని ఏలుతుంటే ఆయన తమ్ముడు అనిల్ అంబానీ ఆస్తులు జప్తు అవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆస్తుల పంపకాల తర్వాత అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌ కామ్‌) టెలికాం కంపెనీ ఏర్పాటు చేశారు. అదే ఆయన కొంప (అబోడ్) ముంచింది. ఆ సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో అప్పుల కోసం బ్యాంకులను ఆశ్రయించారు.

ADVERTISEMENT

అయితే అక్కడా అతి తెలివి ప్రదర్శిస్తూ మోసం చేసి రూ.40,000 కోట్లు లాగేయడంతో ఈ కథ మొదలైంది. ఈ వ్యవహారంలో అనిల్ అంబానీ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ కేసు నమోదు చేసి వరుసగా ఆస్తులు జప్తు చేస్తోంది. ముంబైలోని 17 అంతస్తుల ‘అబోడ్’ని ఈడీ అధికారులు ఇటీవల జప్తు చేశారు. అబోడ్ విలువ సుమారు రూ. 3,716.83 కోట్లు అని ఈడీ అధికారులు ప్రకటించారు. తాజా జప్తుతో కలిపి రూ.15,700 కోట్లు రాబట్టగలిగింది.

ఈ ఆస్తుల జప్తులు కొనసాగుతుండగానే మరోపక్క నోటీసులు పంపించి విచారణకు రప్పిస్తోంది. నేడు ఇదే కేసులో రెండోసారి ఢిల్లీలో ఈడీ విచారణకు అనిల్ అంబానీ హాజరయ్యారు.

ముఖేష్, అనిల్ ఇద్దరూ ఒకే తండ్రి బిడ్డలు. వారిలో అన్న ముఖేష్ అంబానీ పట్టిందల్లా బంగారంలా మారుతుంటే, తమ్ముడు అనిల్ అంబానీ ముట్టిందలా బూడిదగా మారడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

మరీ ముఖ్యంగా ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితులలో ముఖేష్ అంబానీ ఉండగా, ఆయన తమ్ముడు ఆస్తులు పోగొట్టుకుంటూ ఈడీ ఎదుట దోషిగా నిలబడాల్సిన పరిస్థితి మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది.

ముఖేష్ అంబానీ తుమ్మినా దగ్గినా యావత్ దేశం అల్లాడిపోతుంది. షేర్ మార్కెట్లకు ఆటుపోట్లు వచ్చేస్తాయి. కానీ అనిల్ అంబానీ ఇంత దయనీయ పరిస్థితిలో ఉన్నా దేశంలో పట్టించుకునే నాధుడే లేకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఒకే తండ్రి కడుపున పుట్టిన ఇద్దరి జీవితాలు ఇంత భిన్నంగా ఉండటం అసాధారణం కాకపోవచ్చు. కానీ ఈ స్థాయిలో ఉన్న కుటుంబలో ఈవిధంగా జరుగుతుండటం విచిత్రమే కదా?

ADVERTISEMENT
Latest Stories