గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ విశాఖ నగరానికి వస్తోందంటే నేటికీ చాలా మందికి నమ్మకం కలగడం లేదు. దానిపై మొదట సన్నాయి నొక్కులు నొక్కినవారే ఆ తర్వాత దాని క్రెడిట్ తీసుకునేందుకు ప్రయత్నించారు.
విశాఖలో గూగుల్ ఏఐ హబ్ గురించి ఆ సంస్థ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎనర్జీ విభాగం ప్రిన్సిపల్ అలెగ్జాండర్ స్మిత్ కొన్ని ముఖ్యవిషయాలు చెప్పారు. ఆ వివరాలు క్లుప్తంగా..
1. 2028 చివరి నాటికి విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్, ఏఐ హబ్ తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తాం.
2. విశాఖ కేంద్రంగా హబ్-అండ్-స్పోక్ విధానంలో దేశవ్యాప్తంగా హైస్పీడ్ కనెక్టివిటీ కల్పిస్తాం.
3. గూగుల్ విశాఖ నుంచి దేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు అత్యంత వేగవంతమైన, అధిక సామర్థ్యం కలిగిన ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తాం.
4. సింగపూర్, ఆస్ట్రేలియా, పశ్చిమ ఆసియా, యూరప్ మార్కెట్లకు నేరుగా వేగవంతమైన కనెక్టివిటీ కోసం విశాఖ నుంచి సముద్రగర్భంలో అండర్ వాటర్ కేబుల్స్ ఏర్పాటు చేస్తాం.
5. భవిష్యత్తులో ఈ నెట్‌వర్క్‌ను అమెరికా వరకు విస్తరించేలా ప్రణాళికలు రూపొందించుకున్నాము.
6. రాబోయే 14 ఏళ్ళలో భారత్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతాం.
7. విశాఖ AI హబ్‌లోని డేటా సెంటర్‌ను ‘ఎయిర్ కూల్డ్ టెక్నాలజీ’తో నిర్మించి, నిర్వహించేలా ముందే ప్లాన్ చేసుకుంటున్నాము.
8. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోని 10,000 మంది మహిళలకు ఏఐ, ఐటి రంగాలలో శిక్షణ ఇస్తాం.
9. సామాజిక బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతాం.
10. క్లుప్తంగా గూగుల్ విశాఖ అంటే.. 1 గిగావాట్ సామర్ధ్యంతో ఏఐ ఆధారిత డేటా సెంటర్, దేశవ్యాప్తంగా హైస్పీడ్ నెట్‌వర్క్ ప్రొవైడర్, ఫైబర్ మరియు సముద్రగర్భ కేబుల్స్ ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, భారీ పెట్టుబడి అని అలెగ్జాండర్ స్మిత్ చెప్పారు.
కనుక గూగుల్ విశాఖపై ఎవరూ ఎటువంటి అపోహలు , అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. విశాఖకు గూగుల్ రాక ఖాయం అయినప్పుడే దేశంలో వివిధ రంగాలకు చెందిన సంస్థల దృష్టి విశాఖపై పడింది. గూగుల్ విశాఖ కార్యకలాపాలు మొదలయ్యే సరికి విశాఖ రూపురేఖలు అనూహ్యంగా మారిపోవచ్చు. అలాగే ఇటు ఉత్తరాంధ్రా నుంచి అటు తూర్పు గోదావరి వరకు అన్ని జిల్లాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ అభివృద్దికి విశాఖలో రుషికొండపై జగన్ నిర్మించుకున్న ఐరావతమే సాక్షిగా నిలుస్తుంది.





