ఒక యుద్ధం జరిగితేనే విలవిల.. ఇప్పుడు ఒకేసారి రెండు యుద్ధాలు!

Explosion visuals representing the Iran conflict and Russia-Ukraine war causing global oil and fuel crisis fears in India

“నేను అమెరికా అధ్యక్షుడినైతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పదిరోజుల్లో ఆపేస్తానని” గొప్పలు చెప్పుకున్న డోనాల్డ్ ట్రంప్‌ అదెలాగూ ఆపలేకపోయారు. కనీసం ‘వీకెండ్ పిక్నిక్’లా ఇరాన్‌తో మొదలు పెట్టిన యుద్ధం 3 నెలలవుతున్నా ఇంకా ఆపలేకపోతున్నారు.

అమెరికాతో శాంతి చర్చలు కొలిక్కి వచ్చాయంటూ ఇరాన్‌ స్వయంగా చెప్పి హోర్మూజ్ జలసంధిని విదేశీ రవాణా నౌకలకు తెరవడంతో యుద్ధం ముగిసిందనే అందరూ అనుకున్నారు.

ADVERTISEMENT

కానీ 24 గంటలు గడవక మునుపే దక్షిణ ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా దళాలు భీకర దాడులు చేసింది. ఓ పక్క చర్చలు జరుగుతుంటే అమెరికా దాడి చేయడాన్ని ఇరాన్‌ తీవ్రంగా ఖండించింది. కనుక కథ మళ్ళీ మొదటికి రావచ్చు.

మరోపక్క రష్యా కూడా మళ్ళీ ఉక్రెయిన్‌పై భీకర దాడులు మొదలుపెట్టింది. రాజధాని ‘కీవ్’లో ఉన్న విదేశీయులు, దౌత్యవేత్తలు తక్షణం నగరాన్ని వీడి వెళ్ళిపోవాలని సూచించింది. ఈసారి నిర్దేశిత లక్ష్యాలపై మరింత భీకర దాడులు చేస్తామని రష్యా ప్రకటించింది.

అమెరికా-ఇరాన్‌ యుద్ధంతోనే యావత్ ప్రపంచదేశాలు పెట్రోల్, డీజిల్‌ కోసం విలవిలలాడుతున్నాయి. ఇప్పుడు ఒకేసారి రెండు యుద్ధాలు జరిగితే భారత్‌లో చమురు, గ్యాస్ మంటలు తప్పవు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ హెచ్చరించినట్లు భారీ ఆర్ధిక సంక్షోభం తప్పదు. కనుక అవకాశం ఉన్న ప్రజలందరూ ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం మంచిది.

ADVERTISEMENT
Latest Stories