ఈరోజు మొదట మాజీ ఎంపీ హర్షకుమార్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. దానిలో కాకినాడ సముద్ర తీరంలో లంగరు వేసిన ఓ భారీ నౌకలోకి ఇసుక లోడింగ్ అవుతోంది.
ఆ తర్వాత కొద్ది సేపటికే వైసీపీ అనుకూల వెబ్‌సైట్ సోషల్ మీడియా ఖాతాలో ఆ వీడియో ప్రత్యక్షమైంది. వెంటనే వైసీపీ సోషల్ మీడియా ఖాతాలలో కూడా అది ప్రత్యక్షమైంది.
కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కాలువలు నదులలో ఇసుకను దోచేశారు. ఇప్పుడు సముద్ర గర్భంలో ఇసుకను కూడా విడిచి పెట్టడం లేదు. భారీ నౌక, ఆధునిక యంత్రాలతో సముద్ర గర్భంలో ఇసుకను అనధికారంగా తోడేసుకుంటుంటే, జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
షిప్ యార్డులు, పోర్టులకు భారీ నౌకలు వస్తుంటాయి. అవి తీరానికి దగ్గరగా రావాలంటే అక్కడ సముద్రం లోతుగా ఉండాలి. లేకుంటే మునిగిపోయే ప్రమాదం ఉంది. కనుక డ్రెడ్జింగ్ కార్పోరేషన్ వంటి కొన్ని సంస్థలు సముద్ర తీరాలలో ఇసుకను భారీ యంత్రాలతో తోడేసి కాస్త దూరంగా పోస్తుంటాయి.
ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. సాధారణ రాజకీయ నాయకులు చేయగలగేది కాదు. కానీ కూటమి నేతలే సముద్రంలో ఇసుకని తవ్వేసి తీసుకుపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. సాక్ష్యం కోసం వీడియో కూడా పెట్టింది.
కనుక దీనిపై జిల్లా కలెక్టర్, కూటమి ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడం అవసరం. లేకుంటే వైసీపీ దీని గురించి మరిన్ని కట్టు కధలు చెప్పే ప్రమాదం ఉంటుంది.
కాకినాడలో ఇసుక దోపిడీకి కూటమి నేతలు కొత్త ప్లాన్
సముద్రంలో ఇసుకను అనధికారికంగా డ్రెజ్జింగ్ చేయిస్తున్న @ncbn కూటమి నేతలు
20 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏటి కాలవలు, వాగులు, నదులలోని ఇసుకను దోచేశారు
ఇప్పుడు సముద్రంలోని ఇసుకపై పడ్డారు. కలెక్టర్లు (… pic.twitter.com/byUK5w2c1X
— YSR Congress Party (@YSRCParty) March 7, 2026




