ఇటీవల ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ‘కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై మొట్టమొదట తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో అయన సినిమాలు ఆడనీయబోమని హెచ్చరించారు.
ఆయన నిన్న అమరావతి వచ్చి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని కలిసి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఆహ్వానించారు.
అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ గురించి అప్పుడు నేను కాస్త ఆవేశంగా మాట్లాడిన మాట వాస్తవమే. కానీ ఇంత చిన్న విషయానికి అంత తీవ్రంగా స్పందించాల్సి ఉండకూడదని తర్వాత అనిపించింది. కనుక ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడను,” అని అన్నారు.
“ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మంచి విజనరీ కలిగిన నాయకుడు. ఆనాడు విజన్ 2020, హైదరాబాద్‌లో ఐటి కంపెనీల గురించి గురించి మాట్లాడితే చాలా మందికి అర్ధం కాలేదు.
కానీ ఆయన విజన్ ఏవిధంగా ఉంటుందో ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని చూస్తే అర్ధమవుతుంది. అలాంటి విజనరీ నాయకుడు దగ్గర నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను.
అలాంటి గొప్ప నాయకుడిని గత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెడితే తెలంగాణ రాష్ట్రంలో నేనొక్కడినే ఖండించాను. కేటీఆర్ ఆయన గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఫోన్ చేసి అది సరి కాదని చెప్పాను,” అని అన్నారు.
కొన్ని రోజుల క్రితం … ఇప్పుడు మాట్లాడింది మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే. కానీ ఆయన మాటలలో ఎంత వ్యత్యాసం ఉంది! చంద్రబాబు నాయుడు విజనరీ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తించారు. బహిరంగంగా చెప్పారు.
కానీ కేసీఆర్, కేటీఆర్, జగన్, వైసీపీ నాయకులు మాత్రం నేటికీ చంద్రబాబు నాయుడుని పదేపదే విమర్శిస్తుంటారు. విజనరీని అర్ధం చేసుకోలేక అంగీకరించలేక అవహేళన చేస్తుంటారు.
కానీ ప్రతిభ, సమర్దత, చిత్తశుద్ధి గల నాయకులకు అవమానాలు ఎదురైనా వారికి ఎల్లప్పుడూ గౌరవం లభిస్తూనే ఉంటుందని చెప్పేందుకు ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంటుంది?
ఏపీకి వెళ్లి చంద్రబాబు నాయుడిని పొగడ్తలతో ముంచెత్తిన మంత్రి కోమటిరెడ్డి
ఆరోజు చంద్రబాబు నాయుడును జగన్ అరెస్ట్ చేస్తే తెలంగాణలో నేనే ఒక్కడినే ప్రొటెస్ట్ చేశాను
హైదరాబాద్‌లో నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్తలను ఆరోజు అడ్డుకోవద్దని కేటీఆర్కు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన
చంద్రబాబు… pic.twitter.com/I4p7RG183d
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2025






