ధోని కెప్టెన్సీకి ఇదే చివరి అవకాశం?

ms_dhoniవరుసగా ప్రధాన జట్ల మీద వరుస ఓటములు… ఖచ్చితంగా ధోనిని ఈ అంశం ప్రభావితం చేస్తోందని చెప్పకతప్పదు. లేదంటే ఇన్నాళ్ళు 5, 6 స్థానాలలో బరిలోకి దిగిన ధోని 4వ స్థానంలో బరిలోకి దిగడం వెనుక అసలు కారణం ఇదే. గతంలో యువరాజ్ వంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ ఆ స్థానంలో ఉండడంతో ధోనికి ఆ లోటు తెలియలేదు. కానీ, యువరాజ్ తర్వాత రైనా కొన్నాళ్ళ పాటు మురిపించినా, యువీ సత్తాతో పోల్చలేం. దీంతో మరొక ఆప్షన్ లేక స్వయంగా తానే రంగంలోకి దూకారు ధోని.

ADVERTISEMENT

ఇదంతా మహేంద్ర సింగ్ ధోనిని వెన్నాడుతోన్న ఓటమి భయం. ఒక్క జింబాబ్వే మినహా అన్ని జట్లపై వరుసగా ఓటములు చవిచుస్తూ విమర్శలను ఎదుర్కొంటున్న ధోనికి నేడు విశాఖలో జరగనున్న ఆఖరి వన్డే కీలకం కానుంది. సిరీస్ లో 2-2తో సమ ఉజ్జీలుగా ఉన్న ఇరుజట్లు… ఆఖరి పోరాటం కోసం సన్నద్ధమవుతున్నాయి. కోహ్లి నాయకత్వంలో టెస్ట్ సిరీస్ ను ‘క్లీన్ స్వీప్’తో ఓటమి పాలు కావడంతో, ధోని సారధ్యంలోని వన్డే సిరీస్ ను ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్న కివీస్ జట్టు, ఫుల్ కాన్ఫిడెన్సుతో బరిలోకి దిగుతోంది.

ఒకవేళ ధోని నేడు కూడా టీమిండియాకు కప్ ను అందించడంలో విఫలమైతే, కెప్టెన్సీపై అది తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. టెస్టుల్లో విశేషంగా రాణిస్తూ, ప్రత్యర్ధులను క్లీన్ స్వీప్ చేస్తున్న విరాట్ కోహ్లి చేతికే వన్డే, టీ 20 పగ్గాలు వెళ్ళే అవకాశం ఉంది. బహుశా ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనియే ఒక సంచలన విషయం ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో విశాఖ వేదిక ఎలాంటి సంచలనాలకు వేడుక అవుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories