కమల్ హాసన్ తో సహా 9 మందికి హైకోర్ట్ నోటీసులు!

Legal Notices Actor Kamal Haasanదక్షిణ భారత చిత్ర ప్రముఖుల సంఘమైన నడిగర్ సంఘం భవన నిర్మాణ డీల్ వ్యవహారంలో హీరోలు కమల్ హాసన్, విశాల్ తో సహా తొమ్మిది మందికి మద్రాస్ హైకోర్టులు జారీ చేసింది. తాంబరం ప్రాంతానికి చెందిన నడిగర్ సంఘం సభ్యుడు వారాహి, హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తూ, భవన నిర్మాణ నిర్ణయం ఏకపక్షమని, తమతో చర్చించకుండానే, బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించాడు.

ఈ డీల్ వెంటనే రద్దు చేయాలని కోర్టును కోరగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్, ట్రెజరర్ కార్తి, ట్రస్ట్ సభ్యులుగా ఉన్న కమల్, కుట్టి పద్మిని, ఎస్వీ శేఖర్, పూచి మురుగన్ తదితరులకు నోటీసులు ఇస్తూ, 19వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు – ప్రత్యారోపణలతో తమిళనాట నడిగర్ సంఘం అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories