కొదమసింహంకు నువ్వే కరెక్టు అన్నా

Ram Charan - Upasana-Kamineni vacation in africaగత కొంత కాలంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్న రామ్ చరణ్. ఇటీవలే కాలికి గాయం కావడంతో బ్రేక్ దొరికింది. దీనితో ఆయన తన సతీమణి ఉపాసనతో ఆఫ్రికాకు హాలిడేకి వెళ్లారు. ఈ నెల 14న వారి పెళ్లి రోజు కాబట్టి దానిని అక్కడే సెలెబ్రేట్ చేసుకుని ఇండియా తిరిగి వస్తారు. వచ్చీ రాగానే తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడు రామ్ చరణ్. ఇది ఇలా ఉండగా తమ హాలిడే ఫోటోలను ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో పెడుతూ ఉంటారు ఉపాసన.

ADVERTISEMENT

ఒకరకంగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ కు ఆయన అభిమానులకు ఆమె వారధి. తాజాగా ఆమె ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో రామ్ చరణ్ హాట్ పెట్టుకుని సోఫా మీద ఠీవిగా కూర్చున్నాడు. ఈ ఫోటోను చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. కొదమసింహంలో చిరంజీవి లుక్స్ ఉన్నాయని, ఆ చిత్రం రీమేక్ చెయ్యాలని ఉపాసనకు ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హాలీవుడ్ నటి డైజీ ఎడ్గర్ జోన్స్ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె పాత్ర కోసం ఇంకా వేట కొనసాగుతుంది. జులై 30, 2020 తారీఖున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. బాహుబలి లగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదల కాబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories