ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఇవాళ్ళ ఓ విచిత్రం జరిగింది. ఇద్దరు ప్రేమికులు ప్లాట్ ఫారంపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండగా హటాత్తుగా అబ్బాయి తల్లి తండ్రులు అక్కడకు చేరుకున్నారు.
వారు వస్తున్నప్పుడు వివాహ నిశ్చితార్ధానికి అవసరమైన వస్తువులు కూడా వెంట తెచ్చారు. అబ్బాయి తల్లి వారిద్దరికీ అక్కడే వివాహ నిశ్చితార్దం చేసేశారు!
ముందుగా ఆ అమ్మాయి తలపై దుపట్టా వేసి ఆమె చేతిలో కొత్త బట్టలు, స్వీట్స్ ప్యాకట్ వగైరా పెట్టారు. తర్వాత వారిరువురికీ ఆమె స్వీట్స్ తినిపించారు. అబ్బాయి తల్లి తండ్రులు వాళ్ళ చేత తమ కాళ్ళు మొక్కించుకొని అక్షింతలు జల్లి శీర్వదించారు. ఈ తతంగం అంతా మొబైల్ ఫోన్లో వీడియో రికార్డింగ్ చేయించి, దానిని ఆ అమ్మాయి తల్లితండ్రులకు పంపించారు!
ఆ తల్లి ఇచ్చిన షాక్‌తో ఏం మాట్లాడాలో తెలియని స్థితిలోనే వారుండగానే ఈ తతంగం అంతా జరిపించేశారు. ఇలా చేస్తే ఆ అమ్మాయి కుటుంబ ప్రతిష్ట దెబ్బ తింటుందని అబ్బాయి తల్లికి నచ్చజెప్పబోతే, “మరి పెళ్ళి చేసుకోకుండా మీరిద్దరూ ఇలా తిరుగుతుంటే మన కుటుంబ ప్రతిష్ట కూడా పోతోంది కదా? ఇప్పుడు హాయిగా తిరగండి,” అంటూ కొడుకు నోరు మూయించింది ఆ తల్లి.
ఆమె ఈవిధంగా చేయడం చాలా విచిత్రంగానే అనిపించవచ్చు. కానీ ఆమె కోణంలో నుంచి చూసినా, ఆ అమ్మాయి కోణంలో నుంచి చూసినా ఇది సబబుగానే అనిపిస్తుంది.
తమ కూతురు ముక్కూమొహం తెలీని కుర్రాడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు తల్లితండ్రులకు తెలిస్తే వారు తమ పరువు పోతుందని బాధపడతారు. ఒకవేళ ఆ అబ్బాయి ఆమెను మోసం చేసి పారిపోతే ఆమె జీవితం కూడా నాశనం అవుతుంది.
వారు తమ ప్రేమ విషయం తల్లితండ్రులకు తెలియజేసేందుకు భయపడుతూ ఉండవచ్చు. లేదా సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్దామనో లేదా ఉద్యోగాలు వచ్చిన తర్వాత చెప్దామని అనుకోని ఉండొచ్చు. కానీ వారి ప్రేమ తేడా కొడితే నష్టపోయేది అమ్మాయే.
ఆ అమ్మాయి ఎవరో ఏమిటో తెలియకపోయినా ఈవిధంగా వివాహ నిశితార్ధం చేసి కోడలుగా స్వీకరిస్తున్నారు. కనుక ఆ తల్లి చేసింది సబబే అనిపిస్తుంది. అవునా కాదా?
Mother caught her son with his girlfriend at a metro station.
She immediately arranged his engagement on spot
Intelligent Mom settled the issue in one go, ending the need for excuses or secret meetings. pic.twitter.com/xyk3lYdgqu
— News Algebra (@NewsAlgebraIND) February 7, 2026




