ఏడెనిమిది యుద్ధాలు ఆపిన శాంతి దూత ట్రంప్‌కు మళ్ళీ చేతి నిండా పని తగిలింది. భారత్-పాక్ యుద్ధం ఆపించేసి మూడున్నర కోట్ల మంది ప్రాణాలు ట్రంప్ కాపాడారు. ప్రస్తుతం ఆయన ఇరాన్‌తో యుద్ధానికి ముహూర్తం చూసుకుంటూ కాస్త ఏమరపాటుగా ఉన్న సమయంలో, ఇక్కడ పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్, అక్కడ రష్యా-ఉక్రెయిన్ దేశాలు పరస్పరం మళ్ళీ భీకర దాడులు జరుపుకుంటున్నాయి. కనుక శాంతిదూతకు మళ్ళీ చేతి నిండా పని పడింది.
భారత్ వంటి శక్తివంతమైన దేశాన్ని కంటి సైగతో యుద్ధం చేయకుండా ఆపేశానని గొప్పలు చెప్పుకునే ట్రంప్, తాము విదిలించే అప్పులతో మనుగడ సాగిస్తున్న పాకిస్తాన్, తాము ఇచ్చిన ఎఫ్-16 యుద్ధ విమానాలతో పొరుగు దేశంపై దాడి చేస్తుంటే ఆపలేకపోతే అవమానమే కదా?
ఇంకా అవమానకరమైన విషయం ఏమిటంటే, ఇది వరకు భారత్ వాయుసేన పాత డొక్కు మిగ్-21 యుద్ధ విమానంతో ఓ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేస్తే, ఇప్పుడు తాలిబన్లు మరో ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశారట! తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించుకుంది.
ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మేడిన్ అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాలు తాలిబన్లు కూడా కూల్చివేయగలిగితే అమెరికాకు ఇంతకంటే అవమానం ఏముంటుంది? కనుక పాక్-ఆఫ్ఘన్ దేశాలలో ప్రాణ నష్టం నివారించడం కంటే, ముందు అత్యవసరంగా ఈ యుద్ధం ఆపడం చాలా ముఖ్యం. లేకుంటే మరొకటి కూల్చేసి సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే అమెరికా పరువు నయగరాలో కలిసిపోతుంది!
BIG BREAKING NEWS
This is a Pakistani military F-16, American-made, that Afghan defensive forces have shot down. pic.twitter.com/7qBAjv89rk
— Afghanistan Defense (@AFGDefense) February 27, 2026




