అంతిమతీర్పు: స్వామి వారిదే… మామూలుగా ఉండదు!

Tirumala ghee controversy

నిప్పుతో చలగాటం ఆడకూడదని అందరికీ తెలుసు. అదేవిధంగా కులం, మతం దేవుడు, ప్రజల నమ్మకాలు, భాషలు, సంస్కృతులతో కూడా చలగాటం ఆడటం చాలా ప్రమాదకరం…. అని పలు సందర్భాలలో నిరూపితమవుతూనే ఉంది.

కానీ కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడున్న తిరుమల శ్రీవారితో, కల్తీ నెయ్యి వివాదంతో అధికార ప్రతిపక్షాలు చలగాటం ఆడుతూనే ఉన్నాయి.

ADVERTISEMENT

ఓ పక్క తాము గీత దాటుతున్నామని, అది చాలా ప్రమాదకరమని తెలిసి ఉన్నప్పటికీ ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. పైగా తిరుమల వెంకన్నతో పెట్టుకున్నవారు నాశనం అయిపోతారని వారే చెపుతున్నారు. కనుక వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకుంటున్నారని అనుకోవచ్చు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలో కొంత మంది నేతలు అన్యమతస్థులు కనుక వారికి ఇలాంటి పట్టింపులు, సెంటిమెంట్లు ఉండవు. కనుక వారు తిరుమల వెంకన్న పేరుతో రాజకీయాలు చేయడానికి ఏమాత్రం భయపడటం లేదు.

కానీ అదే పార్టీలో వెంకన్నపై అపారమైన భక్తి, నమ్మకమున్నవారు కూడా ఉన్నారు. కానీ వారు కూడా తమ పార్టీ లైన్ ప్రకారం తిరుమల వెంకన్న పేరుతో రాజకీయాలు చేయక తప్పడం లేదు. మొన్న మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు, ప్రతిమలు పట్టుకొని వచ్చి రాజకీయాలు చేయడమే ఇందుకు నిదర్శనం.

అయితే స్వామివారిని ఇలవేల్పుగా భావించే సిఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు కూడా ముందుకే సాగుతున్నారు. ఈ అంశం చాలా సున్నితమైనదని, తమ వాదనలతో కూడా భక్తులు, హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని తెలిసి ఉన్నప్పటికీ వెనక్కు తగ్గడం లేదు.

తగ్గితే వివేక హత్య కేసులాగే ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కూడా వైసీపీ తమ మెడకు చుట్టేస్తుందనే భయం చేత కావచ్చు లేదా అన్యమతానికి చెందిన వైసీపీ నాయకులు తిరుమల స్వామివారి పేరుతో చేస్తున్న ఈ రాజకీయాలకు దీంతోనే చెక్ పెట్టాలనే ఆలోచన కావచ్చు.

రెండు పార్టీలకు దేని లెక్కలు, కారణాలు దానికి ఉన్నాయి. కానీ గతంలో స్వామివారితో పెట్టుకున్న ఏ పార్టీకి ఆ లెక్కలు ఫలించలేదు.

కొందరు పదవి, అధికారం కోల్పోతే కొందరు ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఈవిషయం కూడా రెండు పార్టీలకు బాగా తెలుసు. కానీ తగ్గేదేలే అంటున్నాయి. కనుక ఆ స్వామివారే తీర్పు చెప్తారు!

ADVERTISEMENT
Latest Stories