ఏపీ రాజకీయాలలో మరుగుతున్న నెయ్యి…

Tirupati Laddu Controversy

తెలంగాణ రాజకీయాలలో అధికార – ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న నీళ్ల రాజకీయం అక్కడి రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తుంటే, ఏపీలో కూటమి vs వైసీపీ గా సాగుతున్న రాజకీయంలో నెయ్యి మరుగుతుంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో అసలు నెయ్యే వాడలేదని, అది పూర్తిగా పామ్ ఆయిల్, ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన ఒక కెమికల్ ప్రోడక్ట్ అంటూ సిట్ తన నివేదికలో పొందుపరిచింది.

ADVERTISEMENT

దీనితో అటు టీడీపీ ఇటు జనసేన, బీజేపీ వైసీపీ ఆ ఏడుకొండల వారి భక్తుల మనోభావాలతో ఆడుకుంది అంటూ వైసీపీ పై విరుచుకుపడుతుంది. అలాగే ఈ అంశం పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ తిరుమలలో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డుల తయారీ జరిగిందని, కాసుల కక్కుర్తి కోసం భోలే బాబా డైరీ నుంచి ఈ కల్తీ నెయ్యిని టీటీడీ కి సరఫరా చేయించారని,

ఈ చర్యలు హిందువుల మనోభావాలతో పాటు శ్రీవారి భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసిందంటూ మండిపడ్డారు బీఆర్ నాయుడు. ఇక నాడు ఈ వివాదం పై ఆవేశంగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ సైతం నెయ్యి పేరుతో రసాయనిక మిశ్రమాన్ని తిరుమలకు సరఫరా చేసారని, వైసీపీ అరాచకాలను చట్ట సభల ప్రజలకు వివరిద్దాం అంటూ తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసారు.

ఇక టీడీపీ సైతం ఈ విషయంలో తమ వాయిస్ బలంగా వినిపించాలని, వైసీపీ విష ప్రచారాలను కల్తీ విషయాలను ప్రజలకు వివరించాలంటూ సంకల్పించింది. అయితే ఈ విషయంలో టీడీపీ, జనసేన వాయిస్ ఇలా ఉంటే వైసీపీ వర్షన్ మరోలా ఉంది.

గతంలో వైసీపీ హయాంలో ఈ తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సిట్ ఇచ్చిన నివేదికలో ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు కానీ అసలు అది నెయ్యి కాదు ఒక కెమికల్ మిశ్రమం అంటూ పొందుపరిచింది.

అయితే దీనితో వైసీపీ కి కావాల్సిన మేరకు సమాచారాన్ని తీసుకుని సిట్ తమకు అనుకూలంగా తీరు ఇచ్చిందని, ముఖ్యమంత్రి బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ తమకు, శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలంటూ అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైసీపీ నానాహంగామా చేస్తుంది. ఇలా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయంలో నెయ్యి మరుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories