ట్రంప్ ఇగో దెబ్బ తింటే ప్రపంచం మూల్యం చెల్లించాలా?

Donald Trump signs executive order imposing new tariffs causing global market concern

ట్రంప్ ఇగో దెబ్బ తింది. దీంతో ప్రపంచ దేశాలకు కొత్త కష్టాలు ముంచుకొచ్చాయి. ఆయన అధ్యక్షుడుగా అధికారం చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై ఇష్టం వచ్చినట్లు సుంకాలు విధించారు. ఆ దెబ్బకే ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్లు నష్టం జరిగింది. ట్రంప్‌ మాట్లాడే ప్రతీ మాట, తీసుకునే ప్రతీ నిర్ణయం, అమెరికా, భారత్‌లతో సహా యావత్ ప్రపంచదేశాల స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి.

ఈ సుంకాల భారం తగ్గించుకోవడానికి భారత్‌తో సహా పలుదేశాలు ఆయన విధించిన పలు షరతులకు తలొగ్గి రాజీ పడ్డాయి. దాంతో ట్రంప్‌ శాంతించి సుంకాలు తగ్గిస్తున్నారు.

ADVERTISEMENT

అయన కొట్టిన దెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు తేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్‌ గతంలో విధించిన సుంకాలు చెల్లవని తీర్పు చెప్పింది. అసలు అలా సుంకాలు విధించే అధికారమే ఆయనకు లేదని తేల్చి చెప్పింది. అయన విధించిన సుంకాలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు అమెరికా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

సుప్రీంకోర్టు తీర్పు ట్రంప్‌ అహాన్ని దెబ్బ తీసింది. దేశాధ్యక్షుడినైన నా అధికారాలనే ప్రశ్నిస్తారా?అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై విరుచుకుపడుతూ, తక్షణమే ప్రపంచ దేశాలపై కొత్తగా 10 శాతం సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆరర్డ్స్ పై ట్రంప్‌ సంతకం చేశారు.

దీంతో భారత్‌తో ప్రపంచదేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అమెరికా అధ్యక్షుడుకి ఆ దేశపు సుప్రీంకోర్టుకి మద్య వివాదం ఏర్పడితే అక్కడే పరిష్కరించుకోవాలి. కానీ ప్రపంచ దేశాలపై రుద్దుతారా? అంటూ సోషల్ మీడియాలో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌ విషయానికి వస్తే ఇటీవలే ట్రంప్‌ శాంతించి సుంకాలు 25 నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్ళీ 10 శాతం పెంచితే మళ్ళీ 28 శాతం అవుతుంది. కనుక కథ మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. ట్రంప్‌ తాజా నిర్ణయంపై భారత్‌ ఇంకా స్పందించాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories