సంక్షేమం ప్రజల కోసం కాదు… ఓట్లకి పెట్టుబడి!

Welfare_Schemes_Telangana_Andhra_Pradeshతెలంగాణ సిఎం కేసీఆర్‌ కొంతకాలం క్రితం సంక్షేమ పధకాల గురించి ఆ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ, “యస్! సంక్షేమ పధకాలు పేద ప్రజల కోసమే అయినప్పటికీ వాటిని రాజకీయంగా మా పార్టీకి ఉపయోగపడేలా వాడుకొంటే తప్పేమిటి?సంక్షేమ పధకాలతో ప్రజలకి మేలు చేసి మా పార్టీకి ఓట్లువేయమని అడిగితే తప్పేమిటి?నిజానికి కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలో ఏ ప్రభుత్వామైన ఇలాగే ఆలోచిస్తుంది. ఇలాగే చేస్తుంది,” అంటూ సంక్షేమ పధకాలు ఓట్ల కోసం పెట్టుబడి కూడా అని శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టిన్నట్లు చెప్పేశారు.

కనుక ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నా, అమ్మఒడి, జగనన్న దీవెన, ముత్తాత ముద్దు అంటూ ఏ పేరుతో ఏ సంక్షేమ పధకమైనా అన్నీ కూడా ఓట్ల కోసం పెడుతున్న పెట్టుబడిగానే చూడాలి. వాటి కోసం ఏ పార్టీ లేదా ముఖ్యమంత్రి కూడా తమ జేబులో నుంచి సొమ్ము తీసి ఇవ్వడం లేదు. ఇవ్వరు కూడా.

ADVERTISEMENT

పన్నుల రూపంలో రాష్ట్ర ప్రజలందరూ చెల్లించిన సొమ్ము నుంచే తమ పార్టీకి తప్పక ఓట్లు వేస్తారనే నమ్మకం ఉన్న ఓటర్లకు (లబ్ధిదారులు) మాత్రమే ప్రభుత్వాలు పంచి పెడుతుంటాయి. ఓట్ల కోసమే సంక్షేమ పధకాలైనప్పుడు పేద ప్రజల కోసమే మేము తపించిపోతున్నామని, మా జేబులో నుంచి డబ్బు తీసి పంచిపెడుతున్నామన్నట్లు గొప్పలు చెప్పుకోవడం, మళ్ళీ వాటి కోసం వందల కోట్లు ఖర్చు చేసి పేపర్, టీవీ ప్రకటనలు ఇచ్చుకోవడాన్ని ఏవిదంగా చూడాలి? అని లబ్ధిదారులు కూడా ఆలోచించాలి.

ఒకవేళ నిజంగా పేద ప్రజల సంక్షేమం కోసమే పధకాలు అమలుచేస్తున్నట్లయితే వాటి గురించి ముఖ్యమంత్రితో సహా మంత్రులు అందరూ ఇంతగా డప్పుకొట్టుకొనేవారే కారు. కానీ ఇంటింటికీ వాలంటీర్లని, గృహసారధులని, మంత్రులు, ఎమ్మెల్యేలని కూడా పంపిస్తూ “మీకు సంక్షేమ పధకాలు ఇస్తున్నాము కనుక వైసీపీకే ఓట్లు వేయాలని పదేపదే గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పధకాల పొందిన విషయం ప్రజలు మరిచిపోకుండా ఉండేందుకు ఇంటింటికీ స్టికర్స్ కూడా అంటించేందుకు సిద్దం అవుతున్నారు.

ప్రభుత్వం సంక్షేమ పధకాల పేరుతో ప్రజాధనాన్ని తన ఓటర్లకి పంచిపెట్టి, తమ పార్టీకి రాజకీయ లబ్ది కలిగించాలని ప్రయత్నిస్తూ, మళ్ళీ వాటి కోసం ఎడాపెడా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుండటాన్ని లబ్ధిదారులైనా సమర్ధించగలరా?

ఎందుకంటే వారు కూడా ఈ అప్పులు, వడ్డీల భారం చెత్తపన్ను, పెంచుతున్న ఇంటిపన్ను, చెత్తపన్ను, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల రూపంలో భరిస్తూనే ఉన్నారు కదా?

ADVERTISEMENT
Latest Stories