భారత్‌ ఖండిస్తే ట్రంప్‌ యుద్ధం మానేస్తారా?

Why India Stayed Silent on US Attacks on Iran

భారత్‌-పాక్‌ లేదా పాక్‌-ఆఫ్ఘనిస్తాన్‌ లేదా రష్యా-ఉక్రెయిన్‌ దేశాలు యుద్ధాలు చేసుకుంటుంటే చాలా దేశాలు స్పందిస్తుంటాయి. వీలైతే మధ్యవర్తిత్వం కూడా చేస్తుంటాయి. మంచిదే.

కానీ అమెరికా ఏ దేశం మీదకైనా దండయాత్రకు బయలుదేరితే ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలు కిక్కురుమనవు!

ADVERTISEMENT

ప్రస్తుతం ఇరాన్‌ మీద అమెరికా బాంబుల వర్షం కురిపిస్తుంటే ఆ దేశంతో మంచి సంబంధాలున్న రష్యా, చైనాలు మొక్కుబడిగా ఖండించాయి.

భారత్‌కు కూడా ఇరాన్‌తో సత్సంబందాలే ఉన్నాయి. కానీ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను భారత్‌ ఖండించలేదు.

పైగా ఈ యుద్ధం ఆరంభం అయ్యే ముందు ప్రధాని మోడీ ఇజ్రాయెల్లోనే ఉన్నారు. ఆ దేశంతో వాణిజ్య, రక్షణ ఒప్పందాలు చేసుకున్నారు. ఆ దేశ ప్రధాని నెతన్యాహూతో ఫోటోలు దిగారు. కనుక ఇజ్రాయెల్‌ దాడులను భారత్‌ ఖండించలేదనుకున్నా అమెరికా దాడులు ఖండించవచ్చు కదా?అని ప్రశ్నించవచ్చు.

కానీ ట్రంప్‌ అధ్యక్షుడుగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి భారత్‌ని ఎంతగా ముప్పతిప్పలు పెడుతున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.

ట్రంప్‌ని ప్రసన్నం చేసుకోవడానికి చవకగా వస్తున్న రష్యా చమురు కొనడం మానుకోవాల్సి వచ్చింది. అమెరికాకు వేలకోట్ల బిజినెస్ (రక్షణ పరికరాల ఒప్పందం) ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా చాలా చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. అన్ని చేస్తే కానీ ట్రంప్‌ ప్రసన్నం కాలేదు. సుంకాలు తగ్గించలేదు.

కనుక ఇరాన్‌ మీద అమెరికా దాడులను ఖండించి మళ్ళీ ట్రంప్‌కి ఆగ్రహం తెప్పించలేదు. ఒకవేళ ద్ధైర్యం చేసి ఖండించినా ట్రంప్‌ ఈ యుద్ధాన్ని ఆపబోరు. కనుక కాని పని కోసం నోరు జారడం దేనికి? మళ్ళీ కొత్త సమస్యలు సృష్టించుకోవడం దేనికి? అని భారత్‌ పరిస్థితులను నిశితంగా గమనించడానికే పరిమితం కాక తప్పడం లేదు.

ఈ విషయాలన్నీ రాహుల్ గాంధీకి కూడా తెలుసు. కానీ తెలియనట్లు మాట్లాడుతున్నారు. అలాంటి వారు ఇంకా చాలా మందే ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories