పాదయాత్ర టు సిఎం పీఠం… జగన్ న్యూ స్కెచ్..?

ys-jagan-cm-chair2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి… 2014లో నారా చంద్రబాబు నాయుడు సిఎం పీఠం అధిష్టించడానికి… ఉన్న ప్రధాన కారణాలలో ‘పాదయాత్ర’ ఒకటి. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవచ్చన్న భావనతో ఆనాడు వైఎస్, చంద్రబాబులు పాదయాత్రలు చేసి విజయం సాధించారు. ఇదే రూట్ మ్యాప్ తో జగన్ కూడా ఆ హోదాను అందుకోవాలని కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల టాక్.

ADVERTISEMENT

ఈ ఏడాది నవంబర్ నుండి ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని జగన్ భావిస్తున్నారట. వేసవి కాలమైతే, నడక పరంగా కాస్త ఇబ్బందులు తలెత్తవచ్చనే అంచనాతో ఈ వింటర్ నుండి పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో పాటు రైతులతో కలిసి చర్చలు జరిపేందుకు ఇదే సరైన సమయంగా సన్నిహితులు సలహా ఇవ్వడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. కాలక్రమేణా బలహీన పడుతున్న పార్టీని ఈ పాదయాత్ర అయినా కాపాడుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది కాలం వేచిచూడాలి.

ఈ పాదయాత్రకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలోనే పార్టీ వర్గాలు అధికారికంగా వెల్లడించనున్నాయని తెలుస్తోంది. ఏ ప్రాంతం నుండి ప్రారంభిస్తారో, ఏ ప్రాంతంలో ముగిస్తారో తదితర విషయాలతో కూడిన సమాచారంతో ఈ ప్రకటన ఉంటుందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. వైఎస్ అనుసరించిన రూట్ నే బహుశా జగన్ కూడా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని టాక్.

ADVERTISEMENT
Latest Stories