వైఎస్ షర్మిల ఢిల్లీకి… అక్కడి నుంచి ఏపీకి?

YS Sharmila

తానొకటి తాలిస్తే దేవుడు మరొకటనుకొన్నాడు… అనే నానుడి అందరూ ఎప్పుడో అప్పుడు వినే ఉంటారు. వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి విషయంలో కూడా సరిగ్గా అదే జరుగుతున్నట్లుంది. పైనున్న ఆ దేవుడిని, ఎదురుగా ఉన్న ప్రజలనే నమ్ముకొన్నానని జగన్‌ పదేపదే చెప్పుకొంటున్నప్పటికీ, ఆయన మొరని ఆ దేవుడి పట్టించుకొన్నట్లు లేదు.

2024లో జరుగబోయే శాసనసభ ఎన్నికల కోసం నాలుగున్నరేళ్ళుగా అన్ని ఏర్పాట్లు చేసుకొన్నప్పటికీ చివరిలో దేవుడు కూడా అంతా తారుమారు చేసేస్తున్నాడు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిల మార్పు, వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలను ఎలాగో నిపటాయించుకోవచ్చు కానీ ఎప్పుడో 5-6 ఏళ్ళ క్రితం సందించి తెలంగాణలో వదిలేసిన జగనన్న బాణం వెనక్కు తిరిగి వచ్చి ఆయనకే గుచ్చుకొనేలా చేస్తుండటం చాలా అన్యాయమే కదా?

ADVERTISEMENT

వైఎస్ షర్మిలకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపురావడంతో ఆమె ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. అక్కడ ఇప్పటికే ఆమె భర్త అనిల్ కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలు జరుపుతూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్‌లో చేరితే పర్వాలేదు కానీ ఏపీ కాంగ్రెస్‌లో చేరితేనే జగనన్నకు ఇబ్బంది మొదలవుతుంది.

కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను ఏపీకి పంపించాలని ఫిక్స్ అయిన్నట్లుంది. ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మానిక్కం ఠాకూర్‌తో సహా కాంగ్రెస్‌ ముఖ్యనేతలను కూడా డిల్లీకి పిలవడంతో వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరడమో లేదా ఆమెకే పార్టీ పగ్గాలు అప్పగించడమో జరుగబోతోందని స్పష్టమవుతోంది.

కనుక ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్టానంతో భేటీ ముగిసిన తర్వాత వైఎస్ షర్మిల నేరుగా విమానంలో గన్నవరం రాకపోయినా, ఆ మెసేజ్ తప్పకుండా వస్తుంది. కనుక వైసీపిలో ఉండాలనుకొంటున్న రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని వంటివారు, సీట్లు దొరక్క బయటకు వెళ్ళాలనుకొంటున్నవారు అందరూ వైఎస్ షర్మిలని రిసీవ్ చేసుకోవడానికి సిద్దంగా ఉండాలి.

ADVERTISEMENT
Latest Stories